CM Revanth Reddy: ఇటీవల ఎన్నికల సంఘం సర్ అనే విధానానికి శ్రీకారం చుట్టింది. ఒకటి కంటే ఎక్కువ ఓటు హక్కు కలిగిన వారిని గుర్తిస్తోంది. సరైన ఆధారాల సమర్పించకుండా ఓటు హక్కు పొందిన వారిని గుర్తిస్తోంది. దొంగ ఓట్లను.. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు హక్కు కలిగిన వారి పట్ల చర్యలు తీసుకుంటున్నది. వారికి కేవలం ఒకే ప్రాంతంలో ఓటు హక్కును కల్పిస్తున్నది. తద్వారా ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అడుగులు వేస్తున్నది.
సామాన్యులే కాకుండా.. సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు హక్కు కలిగి ఉన్నారని సర్ అనే విధానం ద్వారా బయటపడుతోంది. ఫలితంగా అటువంటి వారి ఓటు హక్కును ఎన్నికల సంఘం తొలగిస్తోంది. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ నిబంధన ద్వారా ఓటర్ జాబితా పూర్తి ప్రక్షాళనకు గురవుతోంది. దీనివల్ల ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా రూపొందుతోంది.
ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు హక్కు కలిగి ఉన్న వారి మీద చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్ణాటక.. తమిళనాడు.. తెలంగాణ.. ఇంకా మరొక రాష్ట్రంలో ఆయన ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీనిపై 2019లో ఆయన మీద ఫిర్యాదు దాఖలు అయింది. విచారణ జరిగిన అనంతరం బెంగళూరు కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండుచోట్ల కలిగి ఉన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట.. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గాలలో ఆయనకు ఓటు హక్కు ఉంది. రెండుచోట్ల ఎపిక్ టీఇఎస్ 0274035 నెంబర్ తో ఆయన రెండు బూట్లు కలిగి ఉన్నారు. ఇటీవల ఎన్నికల సంఘం రెండు చోట్ల ఒకే వ్యక్తికి ఓటు హక్కు కలిగి ఉంటే శిక్ష తప్పదని హెచ్చరించింది. పలు ప్రాంతాలలో ఓటుకు ఉన్నందున ఇటీవల ప్రకాష్ రాజ్ కు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారింటి జారీ చేసింది. ఓకే ఎపిక్ నంబర్ తో రేవంత్ రెడ్డి ఓటు హక్కు కలిగి ఉన్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు
అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్), మరియు కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్) నియోజకవర్గాలలో ఒకే EPIC (TES0274035) నంబర్‌తో రెండు ఓట్లు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి
అయితే, రెండు చోట్ల ఒకే వ్యక్తికి ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష… https://t.co/m5IWAlifNu pic.twitter.com/XbykFinwjh
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2026
