Balakrishna: నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…ముఖ్యంగా బాలయ్య బాబు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేస్తున్నాడు అంటే ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ ని సాధిస్తోంది నే ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘రౌడీ ఇన్స్పెక్టర్’ (Rowdy Inspector) లాంటి సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఆయన ఆ సినిమా తర్వాత కంటిన్యూస్ గా సక్సెస్ లను సాధించడంలో కొంతవరకు వెనుకబడిపోయాడు. ఇక ఈ సినిమా వచ్చిన సందర్భంలో బాలయ్య నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంటాడు అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయినప్పటికి బాలయ్య మాత్రం ఆ తర్వాత సక్సెస్ ఫుల్ హీరోగా నిలబడలేకపోయాడు. దానివల్ల చిరంజీవి వచ్చి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. అయితే ఒకానొక సమయంలో వీళ్ళిద్దరికి మంచి పోటీ అయితే నడిచింది. ఇక రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పుడు చిరంజీవి కొంతవరకు డౌన్ ఫాల్ లో ఉన్నాడు. ఇక అదే ఊపులో బాలయ్య వరుస సక్సెస్ లను సాధిస్తే చిరంజీవిని బీట్ చేసే అవకాశం అయితే ఉండేది. కానీ అలా జరగలేదు చిరంజీవి సైతం తొందరగా తేరుకొని వరుస సక్సెస్ లను అందుకున్నాడు. అందుకే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి మాస్ హీరోగా గుర్తింపును దక్కించుకున్న బాలయ్య నెంబర్ వన్ పొజిషన్ ను సాధించడంలో కొంతవరకు వెనకబడ్డాడు…
Also Read: హరిహర వీరమల్లు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ ఉంటుందా..?
సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య ఇప్పుడు వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు. ఇక ఇదే హైప్ లో బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను (Boyapati Srinu) తో చేస్తున్న అఖండ 2 (Akhanda 2) సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినప్పటికి బాలయ్య మాత్రం చాలా వరకు సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. కెరీర్ మొదట్లో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసినప్పటికి ఇప్పుడు అలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే తన అభిమానులు ఆయన నుంచి మాస్ సినిమాలను మాత్రమే కోరుకుంటున్నారు.
కాబట్టి అలాంటి సినిమాలను చేయడానికి మాత్రమే ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు… మరి ఇలాంటి క్రమంలో ఇకమీదటైనా బాలయ్య వరుస సక్సెస్ లను సాధిస్తూ సీనియర్ హీరోలందరిలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంటాడా? లేదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి బాలయ్య సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తాడా లేదా అనేది…