AP Alcohol Permit Rooms: ఏపీలో( Andhra Pradesh) మందుబాబులకు గుడ్ న్యూస్. ఇకనుంచి షాపుల వద్దే తాగవచ్చు. పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటివరకు షాపుల వద్ద విక్రయాలు మాత్రమే జరిగేవి. ఇకనుంచి మాత్రం అమ్మకాలతో పాటు అక్కడే తాగేందుకు అనుమతి ఇవ్వనున్నారు. మద్యం ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వడం ద్వారా అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అనధికారికంగా పర్మిట్ రూములు నడుపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొందరు షాపు యజమానులు పర్మిట్ రూములు నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారికంగా పర్మిట్ రూములు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మద్యం దుకాణాలు ఏర్పాటైనా..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్లో మద్యం పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. అప్పటివరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను కట్టబెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 3500 వరకు మద్యం షాపులు ఏర్పాటు చేశారు. అయితే షాపుల వద్ద తాగేందుకు ఎటువంటి అనుమతులు లేవు. పర్మిట్ రూములు కూడా అనుమతించలేదు. అయితే బార్ పాలసీ ఆగస్టు నెలాఖరు వరకు ఉంది. పర్మిట్ రూమ్లు ఇస్తే ఆ ప్రభావం బార్ల వైపు తప్పకుండా పడుతుంది. అందుకే సెప్టెంబరు నుంచి పర్మిట్ రూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో సైతం దీనిపైనే చర్చించారు. పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Also Read: Nagababu AP Cabinet: నాగబాబుకు నో ఛాన్స్.. అలా చెక్ పెట్టిన పవన్
కమిటీ ఏర్పాటు..
కాగా ఈ పర్మిట్ రూముల( permit rooms ) అనుమతులకు సంబంధించి అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పర్మిట్ రూముల అనుమతికి సంబంధించి ఎంత ఫీజు వసూలు చేయాలి? వాటి ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఉన్నాయా? అన్నదానిపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగా సెప్టెంబరు నుంచి పర్మిట్ రూములు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచుకునేందుకు ఇదో మార్గంగా తెలుస్తోంది.
అదనపు ఆదాయం కోసమే..
తాము అధికారంలోకి వస్తే ప్రైవేటు మద్యం దుకాణాలు( wine shops ) ఏర్పాటు చేయడంతో పాటు పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు అన్ని రకాల పాత ప్రీమియం బ్రాండ్లో అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా 28 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుంది. అయితే ఈ ఏడాది అటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే అప్పట్లో మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల నాన్ రిఫండబుల్ నగదు 2000 కోట్ల రూపాయల రూపంలో సమకూరింది. ఈ ఏడాది అటువంటి పరిస్థితి ఉండదు కనుక పర్మిట్ రూముల ద్వారా అదనంగా ఆదాయం సమకూర్చుకునే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. పర్మిట్ రూములు వస్తే మందుబాబులకు పండగే. బహిరంగ ప్రదేశాల్లో తాగాల్సిన పరిస్థితి ఉండదు.
మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్ లు
మద్యం అమ్మకాలు ప్రోత్సహించేలా పర్మిట్ రూమ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం
మద్యం పర్మిట్ రూమ్ ల అధ్యయనానికి కమిటీ.. అధికారుల సమావేశంలో ఆదేశించిన సీఎం చంద్రబాబు pic.twitter.com/YfJhb1hxNg
— Sagar Reddy (@Sagar_YSJ) July 14, 2025