https://oktelugu.com/

జనాలకు కొత్త డేంజర్.. వస్తే ప్రాణాలు ఖతమే?

ఇప్పటికే కరోనాతో జనం సగం చస్తున్నారు. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలు కూడా హైదరాబాద్ కు జులై వచ్చి ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొని వెళ్లారు. అప్పుడు ఆగస్టు 5న ఆయనకు కరోనా సోకగా.. నిన్న ప్రాణాలు కోల్పోయారు.ఇప్పుడు కరోనాతో పాటు మరో టెన్షన్ జనాలను పట్టి పీడిస్తోంది. Also Read: చైనా వాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు.! కరోనా చికిత్సకు ఇప్పటికీ మందులు లేవు. వ్యాక్సిన్ రాలేదు. దీంతో చాలా మంది ప్రాణాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2020 / 09:02 AM IST
    Follow us on

    ఇప్పటికే కరోనాతో జనం సగం చస్తున్నారు. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలు కూడా హైదరాబాద్ కు జులై వచ్చి ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొని వెళ్లారు. అప్పుడు ఆగస్టు 5న ఆయనకు కరోనా సోకగా.. నిన్న ప్రాణాలు కోల్పోయారు.ఇప్పుడు కరోనాతో పాటు మరో టెన్షన్ జనాలను పట్టి పీడిస్తోంది.

    Also Read: చైనా వాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు.!

    కరోనా చికిత్సకు ఇప్పటికీ మందులు లేవు. వ్యాక్సిన్ రాలేదు. దీంతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వానాకాలం వచ్చింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వానలతో అధికమయ్యే దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది.

    కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉన్న వారికి డెంగ్యూ కూడా చుట్టుముడుతోంది. దీంతో ఏకకాలంలో రెండు ఆరోగ్య సమస్యలకు ఏ చికిత్స అందించాలో తెలియక వైద్యులు ఆగమాగవువుతున్నారు. ఇలా రెండు సోకిన వారిని కాపాడడం కష్టమంటున్నారు.

    తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇలానే కరోనా, డెండ్యూ బారినపడడంతో ఆయనకు చికిత్స అందించడం ఎలాగో తెలియక వైద్యులు సతమతమవుతున్నారు. దీనికి ప్రామాణిక చికిత్స పద్ధతులు లేవని నిపుణులు చెబుతున్నారు.

    Also Read: ఏపీలో కరోనా విజ్రంభణ

    రెండు రోగాలకు ఔషధాలు లేవని.. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అటు రక్తంలోకి ప్లేట్ లెట్స్ ఇటు కరోనా శ్వాస ఇబ్బందులతో ప్రాణాలు పోయేలా ఉంటుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు.