నిరుద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త..?

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి బాగానే ఉన్నా ప్రైవేట్ రంగ సంస్థల పరిస్థితి దారుణంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కంపెనీలు సంస్థలో పని చేసే ఉద్యోగులను తొలగించాయి. దీంతో చాలామంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఇళ్లకే పరిమితమై అప్పులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉన్న ఉద్యోగులకే ఉద్యోగాలు లేకపోవడంతో కొత్త ఉద్యోగాల కల్పన అంత తేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. […]

Written By: Kusuma Aggunna, Updated On : September 26, 2020 2:18 pm
Follow us on

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి బాగానే ఉన్నా ప్రైవేట్ రంగ సంస్థల పరిస్థితి దారుణంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కంపెనీలు సంస్థలో పని చేసే ఉద్యోగులను తొలగించాయి. దీంతో చాలామంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఇళ్లకే పరిమితమై అప్పులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉన్న ఉద్యోగులకే ఉద్యోగాలు లేకపోవడంతో కొత్త ఉద్యోగాల కల్పన అంత తేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : సంచలనం: కేంద్రంపై కేసీఆర్‌ న్యాయపోరాటం?

అయితే నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలవుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గతంతో పోలిస్తే భారీగా ఆదాయం తగ్గింది. దీంతో కేంద్రం మరోమారు ఉద్ధీపన ప్యాకేజీని ప్రకటించనుందని తెలుస్తోంది.

ఇప్పటికే కరోనా వల్ల పలు రంగాలకు కలిగిన నష్టాలను పూడ్చేందుకు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్యాకేజీల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరలేదు. దీంతో 35,000 కోట్ల రూపాయలతో మరో ప్యాకేజీని విడుదల చేయడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు.

ప్రభుత్వం కొత్తగా ప్రకటించబోయే ప్యాకేజీ నిధులను ప్రత్యక్షంగా ఖర్చు చేసే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రధానంగా అర్బన్ జాబ్స్ దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ ఈ నిధులను కేటాయిస్తోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.

Also Read : వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?