ఖమ్మంలో మరోసారి కరోనా కలకలం!

ఖమ్మం జిల్లాలోని ఇటీవల ఒకేసారి ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఘటన మరువక ముందే తాజాగా మధిర మండలం మహాదేవపురంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతుంది. ఇటీవల మహారాష్ట్ర నుండి 17 మంది ప్రత్యేక బస్సులో ఆ గ్రామానికి వచ్చారు. అయితే వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి తెలిపారు. మొత్తం ఏడుగురిని కరోనా టెస్టులకు తరలించగా వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 12:46 pm
Follow us on


ఖమ్మం జిల్లాలోని ఇటీవల ఒకేసారి ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఘటన మరువక ముందే తాజాగా మధిర మండలం మహాదేవపురంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతుంది. ఇటీవల మహారాష్ట్ర నుండి 17 మంది ప్రత్యేక బస్సులో ఆ గ్రామానికి వచ్చారు. అయితే వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి తెలిపారు. మొత్తం ఏడుగురిని కరోనా టెస్టులకు తరలించగా వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ముంబై నుండి ఆ బస్సులో వచ్చిన మిగిలిన వారిని బయటకి పంపించలేదని వారందరిని కూడా ఐసోలాషన్ కి తరలించినట్లు మాలతి తెలిపారు.

ఏప్రిల్ 6వ తేదీన ఖమ్మంలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఆ తర్వాత మరో కేసు ఖమ్మం రూరల్ పరిధిలోని పెద్ద తండాలో నివాసం ఉంటున్న 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ నుంచి నిజాముద్దీన్ సభకు ఢిల్లీకి వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతనితో కలిసి ప్రయాణం చేసిన వారిని క్వారంటైన్‌ కి తరలించి బ్లడ్ శాంపిల్స్ పంపించారు. ఈ విధంగా క్వారంటైన్ లో ఉన్న‌వారిలో ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని కలిసిన 40 మంది వ్యక్తులను క్వారంటైన్‌ కి తరలించి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఎటువంటి సింట‌మ్స్ లేకపోయినా బాధితుడికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు.