ప్రజారవాణాపై కీలక నిర్ణయాలు!

తెలంగాణలోని ప్రజారవాణా పై ఈ రోజు కీలక ఆదేశాలు వెలువడనున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో మంత్రి చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై సాయంత్రం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 1:06 pm
Follow us on

తెలంగాణలోని ప్రజారవాణా పై ఈ రోజు కీలక ఆదేశాలు వెలువడనున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో మంత్రి చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై సాయంత్రం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనే తుది నిర్ణయమని కేంద్రం ప్రకటించింది. ఇక ఇప్పటికే ముంబయి, పంజాబ్‌ తో పాటు ఇతర ప్రాంతాల్లో బస్సు సర్వీసులను పునరుద్ధరించారు.

మరోవైపు ఇకపై క్వారంటైన్‌ కు ఒప్పుకున్న వారికే ప్రత్యేక రైళ్ల టికెట్లు జారీ చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్‌ సైట్‌ లో అంగీకారం తెలపాలి. లేదంటే టికెట్‌ బుకింగ్‌ వీలుకాదు. 14న ప్రత్యేక రైలులో బెంగళూరు వెళ్లిన కొందరు క్వారంటైన్‌ కు ససేమిరా అనడంతో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.