తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తామంటూ వైఎస్ షర్మిల చేసిన ప్రకటనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలోలా పంచ్ డైలాగుల కోసం తపన పడుతున్నారనే విషయం అర్థమవుతోంది. రాజకీయాల్లో దూకుడు చూపించేందుకు షర్మిల హాట్ కామెంట్లు చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. కానీ ఆమె డైలాగులను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డిపైనా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
షర్మిల కామెంట్లపై ఎవరు స్పందించడం లేదు. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె విమర్శలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అనవసరంగా ఆమె స్థాయిని పెంచడమెందుకని కామ్ గా ఉంటున్నారు. ఇప్పటివరకు కనీసం ఒక సర్పంచ్ స్థాయి నాయకుడిని కూడా పార్టీలో చేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు తనకు జంపింగులు అవసరం లేదని తామే నాయకులను తయారు చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీలో ఉన్న వారిని గమనిస్తే వైసీపీ నుంచి వచ్చిన వారు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన వారే కనిపిస్తున్నారు.
ఇక షర్మిల పార్టీ తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపదని పేర్కొంటున్నారు. ఆమె మాటలు ఒక రకంగా చేతలు మరో రకంగా ఉన్నాయని చెబుతున్నారు. ఏదైనా చెబితే దాన్ని చేతల్లో చూపించేలా ఉండాలని సూచిస్తున్నారు. మాట్లాడే ముందు బాగా ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. తెలంగాణలో షర్మిల ప్రభావం ఎక్కడ కనిపించడం లేదని సూచిస్తున్నారు.
షర్మిల ఇలాగే ముందుకు సాగితే పార్టీలో ఎవరు చేరే అవకాశం ఉండదని చెబుతున్నారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంటున్నారు. షర్మిల మాటల్లో సరిణతి లేవని తెలుస్తోంది. ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు. మరి ఏమేరకు ఓటర్లు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.