గులాబీ గూటికి చేరేందుకు కౌశిక్ సమాయత్తం

కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్వయంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొండాపూర్ లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో తన మద్దతుదారుల కోరిక […]

Written By: Srinivas, Updated On : July 20, 2021 3:01 pm
Follow us on

కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్వయంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొండాపూర్ లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో తన మద్దతుదారుల కోరిక మేరకు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు పేదప్రజలకు ఎ:తో మేలు చేశాయని చెప్పారు. కాళేశ్వరం, లోయర్ మానేరు ప్రాజెక్టులతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతుబంధు పథకంతో రైతులు తమ భూములు సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దళిత బంధు ప్రాజెక్టు కోసం హుజురాబాద్ ను పైలెట్ గా తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారని గుర్తు చేశారు.

ఈటల రాజేందర్ కేవలం స్వార్థం కోసమే పోరాడుతున్నారని విమర్శించారు. మంత్రిగా ఉండి హుజురాబాద్ కు ఆయన చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. తనను తాను కాపాడుకునేందకు ఈటల పాటుపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. లేని పోని ఆరోపణలతో ఈటల లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈటలకు గట్టి పోటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. కౌశిక్ రెడ్డి పేరుతో ఆడియో టేపులు బయటకు రావడంతో టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. టికెట్ ఖాయమని అనుకునే సమయంలో రేవంత్, మాణిక్యం ఠాకూర్ పై ఆరోపణలు చేశారు. దీంతో వివరణ అడగడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కౌశిక్ రెడ్డి కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారు ఎక్కేందుకు నిర్ణయించుకున్నారు.