Homeజాతీయ వార్తలుNEET Re Test 2026: నీట్ రీ టెస్ట్.. టెలిగ్రామ్ ను పక్కన పెట్టారు సరే.....

NEET Re Test 2026: నీట్ రీ టెస్ట్.. టెలిగ్రామ్ ను పక్కన పెట్టారు సరే.. వాట్సాప్ సంగతేంటి..

NEET Re Test 2026: లక్షలాదిమంది విద్యార్థులు పరీక్ష రాశారు. కొందరైతే మెరుగైన మార్కులు సాధించడంతో ఈసారి ఎలాగైనా సరే డాక్టర్ కలను నెరవేర్చుకుంటున్నామని భావించారు. కౌన్సిలింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో.. ఒకసారి గా పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చాయి. అది అబద్ధమైతే బాగుండు అని విద్యార్థులు అనుకున్నారు. కానీ అది పచ్చి నిజం కావడంతో విద్యార్థుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డయింది. అప్పటినుంచి నిద్ర, ఆకలి మానేసి విద్యార్థులు ఆవేదనలో కూరుకు పోయారు.

అనేక రకాల ఒత్తిళ్ల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ను మళ్లీ నిర్వహించింది. అయితే ఈసారి పేపర్ లీకేజీ కాకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఫారసు ఆదరణ కేంద్రం టెలిగ్రామ్ మీద ఆంక్షలు విధించింది. ఏకంగా బ్లాక్ చేసి పడేసింది. ఎందుకంటే గతంలో టెలిగ్రామ్ ద్వారానే పేపర్ లీకేజ్ జరిగింది. వందలకొద్ది గ్రూపులు ఏర్పాటు చేసి అక్రమార్కులు టెలిగ్రామ్ ద్వారా భారీగా దండుకున్నారు. అయితే టెలిగ్రామ్ గ్రూపులను రద్దు చేసినప్పటికీ.. సమస్య మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ యాప్ ను బ్లాక్ జాబితాలో పెట్టాలని కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఈనెల 21న రీ టెస్ట్ జరుగుతున్న క్రమంలో.. 22 వరకు టెలిగ్రామ్ మీద కేంద్రం ఆంక్షలు విధించింది.

టెలిగ్రామ్ అనేది మోసపూరితమైన వ్యక్తులకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎటువంటి వివరాలు బయటపడకుండా ఈ గ్రూపులను కొంతమంది అక్రమార్కులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత.. యూసర్లు దానిని చూడకుండా హైడ్ చేయవచ్చు. అంతేకాదు యూజర్ పేర్లతోనే యాప్ వాడుకోవచ్చు. ఒక్కసారి ప్రొఫైల్ క్రియేట్ అయితే కనుక.. ఎటువంటి గుర్తింపు బయటపడకుండా లక్షల మందితో ఛానల్ నిర్వహించుకోవచ్చు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారో అనే విషయాన్ని గుర్తించడం చాలా కష్టం.

ఇటీవల వాట్సప్ కూడా ఫోన్ నెంబర్ హైడ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. వాట్సాప్ లో అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ డిఫాల్ట్ గా ఉంటుంది. టెలిగ్రామ్ లో మనకు మనమే మ్యానువల్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ లో ఎటువంటి కంప్రెషన్ నిబంధన లేకుండానే 2gb ఫైల్ షేర్ చేసుకోవచ్చు. అందువల్లే అక్రమార్కులు టెలిగ్రామ్ వేదికగా కొత్త కొత్త సినిమాలను.. టీవీ షోలను లీక్ చేస్తూ ఉంటారు.. టెలిగ్రామ్ లో ఉన్న ఆ ఫీచర్ ను అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులు పరీక్ష పత్రాలను లీక్ చేస్తున్నారు.. అంతేకాదు కొన్ని సందర్భాలలో ఎడిట్ ఫీచర్ ఉపయోగించి ఫైళ్లను కూడా పూర్తిగా మార్చేస్తున్నారు. అందువల్లే ఇటీవల కేంద్రం ఈ ఫీచర్ ను డిజేబుల్ చేసేసింది.

టెలిగ్రామ్ ను ఈ స్థాయిలో మనదేశంలో వాడుతున్నప్పటికీ.. ఇక్కడ కనీసం కార్యాలయం కూడా లేదు. ఉదాహరణకు వాట్సప్.. ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు యూజర్ల బిహేవియర్ ను అంచనా వేస్తుంటాయి.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా టూల్స్ ఉపయోగించి యూజర్ల యూసేజ్ ప్యాటర్న్ ను నిత్యం గమనిస్తూ ఉంటాయి. అయితే ఈ ఫీచర్ టెలిగ్రామ్ లో లేకపోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version