https://oktelugu.com/

ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని దాదాపు ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నీలం సాహ్ని నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి గవర్నర్ ఆమోదిస్తారని.. ఈ మేరకు ప్రకటన వస్తుందని అంటున్నారు. ప్రస్తుత ఎ‌స్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో.. ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియలో భాగంగా.. ముగ్గురి పేర్లను జగన్ సర్కార్ ప్రతిపాదించింది. నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా చివరికి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్‌గా అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. మాజీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 26, 2021 / 11:11 AM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నీలం సాహ్ని నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి గవర్నర్ ఆమోదిస్తారని.. ఈ మేరకు ప్రకటన వస్తుందని అంటున్నారు. ప్రస్తుత ఎ‌స్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో.. ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియలో భాగంగా.. ముగ్గురి పేర్లను జగన్ సర్కార్ ప్రతిపాదించింది. నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా చివరికి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్‌గా అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది.

    మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌కు ప్రతిపాదన పంపగా.. ఆయన ఆమోద ముద్ర వేశారని సమాచారం. నీలం సాహ్ని ఏపీ ఎస్‌ఈసీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గత రెండేళ్ల నుంచి ఆమె జగన్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.

    కేంద్రం నిబంధనల ప్రకారం.. 67 ఏళ్ల వయసు పైబడిన ఎస్ఈసీ రేసులో సీఎం జగన్ ప్రతిపాదించిన ముగ్గురిలో ప్రేమ్‌చంద్రారెడ్డి, శామ్యూల్ ఈ పోస్టు ఇవ్వడానికి గవర్నర్ సానుకూలత వ్యక్తం చేయకపోతే.. 65 ఏళ్ల లోపే వయసున్న నీలం సాహ్నిని గవర్నర్ నియమిస్తారని భావించిన సీఎం జగన్ ఆమె పేరును కూడా కొత్త ఎస్‌ఈసీగా ప్రతిపాదించారు. సీఎం జగన్ భావించినట్టుగానే గవర్నర్ నీలం సాహ్నిని కొత్త సీఎస్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.

    * నీలం సాహ్ని బయోడేటా
    నీలం సాహ్ని 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆమె సేవలందించారు. నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా కూడా సేవలందించారు. విభజిత ఏపీలో రెండు కీలక పదవులు చేపట్టిన మహిళగా నీలం సాహ్ని చరిత్ర సృష్టించారు. విభజిత ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళా అధికారి నీలం సాహ్నినే కావడం గమనార్హం. విభజిత ఏపీలో ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులైన తొలి మహిళ కూడా నీలం సాహ్నినే కావడం విశేషం.