https://oktelugu.com/

ఎవరీ ఐఏఎస్ రత్నప్రభ? తిరుపతి ఎంపీ సీటు బీజేపీ ఎందుకిచ్చింది?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఖరారు చేశారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఆమె పేరును ప్రకటించింది. రాష్ట్రంలో జనసేన బలంగా ఉన్నా కూడా ఆ పార్టీని తోసిరాజని బీజేపీయే తిరుపతి బరిలో నిలవడం విశేషం. జనసేన-బీజేపీ కూటమి నుంచి ‘రత్నప్రభ’ను పోటీచేయించాలని మోడీ టీం నిర్ణయించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోషల్ మీడియా ద్వారా రత్నప్రభ ఫొటోను షేర్ చేయడంతో ఎవరు ఈమె? […]

Written By: , Updated On : March 26, 2021 / 11:17 AM IST
Follow us on

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఖరారు చేశారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఆమె పేరును ప్రకటించింది. రాష్ట్రంలో జనసేన బలంగా ఉన్నా కూడా ఆ పార్టీని తోసిరాజని బీజేపీయే తిరుపతి బరిలో నిలవడం విశేషం. జనసేన-బీజేపీ కూటమి నుంచి ‘రత్నప్రభ’ను పోటీచేయించాలని మోడీ టీం నిర్ణయించింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోషల్ మీడియా ద్వారా రత్నప్రభ ఫొటోను షేర్ చేయడంతో ఎవరు ఈమె? తిరుపతి ఎంపీ సీటును బీజేపీ ఎందుకిచ్చింది.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

*రత్న ప్రభ బయోడేటా

రత్న ప్రభ ప్రకాశం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాతి చంద్రయ్య కుమార్తె. డాక్టర్ చంద్రయ్య మద్రాస్ రాష్ట్రంలో ఐఏఎస్ గా పనిచేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లోకి మారి ఇక్కడే పదవీ విరమణ చేశారు. రత్న ప్రభ భర్త పేరు విద్యాసాగర్. ఈయన కూడా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కావడం విశేషం.. ఆమె సోదరుడు ప్రదీప్ చంద్ర కూడా ఐ.ఎ.ఎస్ నే.. 2019లో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర పదవీ విరమణ చేశారు.

రత్నప్రభ ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. కర్ణాటక  చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 1981 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రత్న ప్రభ కర్ణాటక రాష్ట్రానికి మూడో మహిళా చీఫ్ సెక్రటరీ. 2018 జూన్ లో ఆమె 36 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యారు.

2019 ఏప్రిల్ లో ఆమె రిటైర్ అయ్యాక కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. స్వయంగా సీఎం కండువా కప్పడంతో ఈమెకు బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అయ్యింది. గతంలో బీజేపీ ప్రభుత్వంలో మెరుగ్గా పనిచేయడంతో ఆమె కు ఈ అందలం దక్కింది.

కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు బీజేపీకి ఫేవర్ గా రత్నప్రభ వ్యవహరించారనే టాక్ ఉంది. కర్నాటకలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించిన రికార్డు ఆమెకు ఉందంటారు. ఇక అంతకుముందు అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు రత్నప్రభ కర్ణాటక రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు.

రత్న ప్రభ దళిత సామాజికవర్గానికి చెందిన వారు. ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడంలో కూడా శాసనం ద్వారా రిజర్వేషన్లు రావడంతో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈమె కర్ణాటక రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

దివంగత వైఎస్ఆర్ అన్నా.. వైఎస్ జగన్ అన్న రత్నప్రభకు అమితమైన అభిమానం ఉండేది. ఈమె ఒకప్పుడు వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితురాలైన అధికారిగా పేరుంది.  ఈ మేరకు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు రత్న ప్రభ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. అంతేకాదు.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచాక కూడా ఆమె ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉండే అధికారుల్లో ఈమె ఒకరు.

*అవార్డులు
1999,2000 సంవత్సరంలో ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్ స్టిట్యూట్ వారి నుంచి అందుకున్నారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో ఈమె బాగా పాపులర్. ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నారు.