సాగర్ లో బీజేపీ సస్పెన్స్ రాజకీయం..

కొంతకాలంగా తెలంగాణ బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీచోట తన బలం,బలగాన్ని చాటుతోంది. సందర్భాన్ని బట్టి విజయం సాధిస్తోంది. మిగితా చోట్ల గెలిచేంత పని చేసి.. అధికార పార్టీకి చుక్కలు చూపుతోంది. అయితే బీజేపీ దూకుడుకు సాగర్ ఉప ఎన్నిక స్పీడ్ బ్రేకర్ గా మారిందని పలువురు అంటున్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏపీ తిరుపతిలోనూ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో […]

Written By: Srinivas, Updated On : March 26, 2021 11:01 am
Follow us on


కొంతకాలంగా తెలంగాణ బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీచోట తన బలం,బలగాన్ని చాటుతోంది. సందర్భాన్ని బట్టి విజయం సాధిస్తోంది. మిగితా చోట్ల గెలిచేంత పని చేసి.. అధికార పార్టీకి చుక్కలు చూపుతోంది. అయితే బీజేపీ దూకుడుకు సాగర్ ఉప ఎన్నిక స్పీడ్ బ్రేకర్ గా మారిందని పలువురు అంటున్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏపీ తిరుపతిలోనూ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. వచ్చే నెలలో ఈ రెండుచోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో మంచి కిక్కిచ్చిన బీజేపీ మళ్లీ స్లో అవుతోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ మళ్లీ తన మునపటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి సాగార్జునసాగర్ సీటు తమదేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ లో తామే పాగా వేస్తామని కొద్దినెలలుగా చెప్పుకొస్తున్న బీజేపీకి సరైన అభ్యర్థి దొరకక అంతర్మథనంలో పడిపోయింది.

తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి కూడా ఏపీ బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది. చచ్చీచెడి అభ్యర్థి లేకపోవడంతో కర్నాటక కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ అదికారి రత్నప్రభను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో ఏపీ బీజేపీ నేతలు విజయం నుంచి కనీసం డిపాజిట్ అయినా సాధిస్తారా అనే నమ్మకం కూడా లేకుండా పోయింది. పైగా 2019లో నోటా కన్నా తక్కువ ఓట్లు రావడం.. ఇప్పుడు మరోసారి కనీసం దాన్ని అధిగమిస్తే చాలు అని బీజేపీ నేతలు తిరుమల వెంకన్నకు మొర పెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నాగార్జున సాగర్ లో బీజేపీ మెరుగైన ఫలితాన్ని సాధించకపోతే.. చాలని ఏపీ బీజేపీ నేతలు మనసులో కోరుతున్నారు.

ఉప ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ బీజేపీలను ఓటర్లు ఓకే గాటన కట్టేయాలనేది ఏపీ బీజేపీ నేతల ఆశ. ఎందుకంటే ఎటూ తిరుపతిలో తాము సాధించేది ఏమీ లేదని ఏపీ బీజేపీ నేతలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించాయి. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా.. జనసేన సహాక నిరాకరణ తదితర అంశాలు తమకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయే తెలుసు. దీంతో మరో తెలుగు రాష్ట్రంలో తమ పార్టీ మెరుగైన ఫలితాన్ని సాధిస్తే.. తాము తలెత్తుకు తిరగలేమనేది ఏపీ బీజేపీ నేతల బాధ.