Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు అంతే. పైగా సెల్ఫీ వీడియో.. అందులోనూ పార్లమెంట్ భవనం.. మొత్తంగా నరేంద్ర మోడీ మారిపోయారు. ప్రధాన మంత్రిగాకుండా జనరేషన్ జెడ్ తరానికి సంబంధించిన యువకుడి లాగా రూపాంతరం చెందారు.
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా నీట్ వ్యవహారానికి సంబంధించి నిరసనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా హింసాత్మకంగా మారాయి. పనిలో పనిగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందులో చేరాయి. ఈ మంటల్లో చలికాచుకోవడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్షాల సహాయంతో ప్రధానమంత్రి ఇంటి ఎదుట ఆందోళన చేసింది. నిరసన చేపట్టింది. రాహుల్ గాంధీ అయితే చినిగిన పాయింట్.. ఓడిపోయిన బూటు ను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు. ముక్కు నుంచి రక్తం కారిందని కూడా చెప్పుకున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హైలెట్ చేసింది. అప్పట్లో చనిపోయిన ఇందిరాగాంధీకి.. ఇప్పటి రాహుల్ గాంధీకి ముడి పెడుతూ త్యాగం అంటూ కవరేజీ ఇచ్చింది
ఇదంతా చూసిన తర్వాత నరేంద్ర మోడీ అనేక రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. యుద్ధ ప్రాతిపదికన మొన్న రాత్రి వీడియో ఒకటి విడుదల చేశారు. కచ్చితంగా దోషులకు శిక్ష పడుతుందని సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత నిన్నటికి నిన్న మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నరేంద్ర మోడీ పూర్తిగా జనరేషన్ జెడ్ తరానికి సంబంధించిన యువకుడి లాగా కనిపించారు. పైగా ఫ్రెండ్స్ అంటూ సంబోధించారు. అంతేకాదు పేపర్ లీకేజీకి పాల్పడిన వారి విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. అంతేకాదు, కొంతమంది మంత్రులను రంగాల్లోకి దింపి సోనం వాంగ్ చుక్ తో మాట్లాడించారు. ఆయనతో ఒక ప్రకటన చేయించారు. దీంతో జనరేషన్ జెడ్ ఆగ్రహాన్ని చల్లార్చారు. అంతేకాదు వారి స్టైల్ కి తగ్గట్టుగా మాట్లాడారు.. మొత్తానికి తనలో ఉన్న జనరేషన్ జెడ్ తరానికి సంబంధించిన యువకుడిని ఆకవిష్కరించి.. నరేంద్ర మోడీ తనకు తానే సాటి అనిపించుకున్నారు. నరేంద్ర మోడీ ఈ వీడియోలు విడుదల చేసిన తర్వాత మీడియాలో చర్చ మారిపోయింది. నిన్నటిదాకా ఆందోళనలకు ప్రయారిటీ ఇచ్చిన మీడియా.. ఇప్పుడు నరేంద్ర మోడీ వీడియోలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ఫలితంగా సమస్య గురించి మరో డిస్కషన్ మొదలైంది. ఈ లోగానే దీనిని అంతం చేయడానికి నరేంద్ర మోడీ శాశ్వత పరిష్కారం మొదలు పెట్టారని బిజెపి నాయకులు అంటున్నారు..
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026






