https://oktelugu.com/

సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ తీరు మార్చుకోవడం లేదు. అనుమతి లేకున్నా నిండు సభలో వీడియోలతో బుక్ అవుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఒకసారి హెచ్చరికలు జారీ చేసిన ఆయన తీరు మారడం లేదు. అప్పట్లో ఏపీకి 3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లు సందర్భంగా కూడా నారా లోకేష్ బాబు శాసనమండలిలో అడ్డంగా దొరికాడు. ఇప్పుడు తాజాగా మరోసారి శాసనమండలిలో అదే పనిచేశారు. నాడు మూడు రాజధానుల సందర్భంగా క్రమంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2020 / 03:15 PM IST
    Follow us on


    టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ తీరు మార్చుకోవడం లేదు. అనుమతి లేకున్నా నిండు సభలో వీడియోలతో బుక్ అవుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఒకసారి హెచ్చరికలు జారీ చేసిన ఆయన తీరు మారడం లేదు.

    అప్పట్లో ఏపీకి 3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లు సందర్భంగా కూడా నారా లోకేష్ బాబు శాసనమండలిలో అడ్డంగా దొరికాడు. ఇప్పుడు తాజాగా మరోసారి శాసనమండలిలో అదే పనిచేశారు. నాడు మూడు రాజధానుల సందర్భంగా క్రమంలో వైసీపీ మంత్రులంతా మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టడం.. టీడీపీ ఎమ్మెల్సీలంతా నిరసన తెలుపుతున్న సందర్భం అదీ. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పెద్ద తప్పు చేసేశారు. అసలు అసెంబ్లీలోనే సెల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. కానీ దాన్ని ఉల్లంఘించి ఏకంగా ఈ గొడవలకు సంబంధించిన సన్నివేశాలను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ ఇరుకునపడింది.

    నారా లోకేష్ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండడంపై వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీరియస్ అయిన షరీఫ్ మందలించడంతో నారా లోకేష్ సెల్ ఫోన్ చిత్రీకరణను విరమించుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించింది. మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరడానికి సిద్ధమైంది.

    తాజాగా మరోసారి లోకేష్ బాబు వీడియో గ్రాఫర్ గా మారారు. కౌన్సిల్ లో వైసీపీ మంత్రుల ఆగ్రహావేశాలను ఆందోళన దృశ్యాలను లోకేష్ బాబు చిత్రీకరించాడు. శాసనసభ అన్ని నిబంధనలను లోకేష్ ఉల్లంఘించాడు. అధికార వైసీపీ దీనిని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. మంత్రి కన్నబాబు దీనిపై మండలి చైర్మన్ వద్ద నిరసన తెలిపాడు. ఈ చర్యను ప్రతిపక్షాలు ఖండించలేదు. ఎందుకంటే మండలిలో ప్రతిపక్ష టీడీపీకే మెజారిటీ ఉంది. అలా వీడియో తీయకుండా ఉండాలని ఎవరూ కూడా లోకేష్ బాబు అనే ధైర్యం చేయలేదు.

    శాసనసభతోపాటు మండలిలో సెల్ ఫోన్ తో వీడియోలు తీయడం తీవ్ర నేరం. అయినా కూడా లోకేష్ బాబు అవేమీ పట్టించుకోకుండా తీసేశాడు. మండలిలో టీడీపీదే ఆధిపత్యం బలం ఉండడంతో లోకేష్ ను ఎవరూ ఏమీ అనలేకపోయారు.అధికార వైసీపీ మంత్రులు ఎంత గింజుకున్నా ఫలితం లేకుండా పోయింది. లోకేష్ వీడియో తీయడాన్ని రిలీజ్ చేసి ప్రజల ముందే తేల్చుకోవాలని వైసీపీ రెడీ అవుతోంది.