చైనా ఆరాటం నీళ్ళ కోసమా?

చైనా తూర్పు లడఖ్ లో దుస్సాహసానికి ఒడిగట్టటానికి రహస్య కారణాలున్నాయని పరిశీలకుల అభిప్రాయం. ముఖ్యంగా పరిశుద్ధమైన నీటి కోసమే చైనా కయ్యానికి కాలు దువ్విందనటానికి ఆధారులున్నాయి. వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. అదేమిటో చూద్దాం. ఇప్పుడు సరిహద్దు పోరాటం జరుగుతున్న ప్రాంతం కారకోరం-హిమాలయాల పర్వతశ్రేణి ప్రాంతం. దానికి ఆవల వుత్తరం వైపు చైనా కి చెందిన జింజియాంగ్ ప్రావిన్సు పూర్తి ఎడారి ప్రాంతం. అక్కడ నీటికొరత సహజంగానే ఎక్కువ. కానీ ఆ ప్రాంతాన్ని కీలకమైన […]

Written By: Ram, Updated On : June 18, 2020 1:52 pm
Follow us on

చైనా తూర్పు లడఖ్ లో దుస్సాహసానికి ఒడిగట్టటానికి రహస్య కారణాలున్నాయని పరిశీలకుల అభిప్రాయం. ముఖ్యంగా పరిశుద్ధమైన నీటి కోసమే చైనా కయ్యానికి కాలు దువ్విందనటానికి ఆధారులున్నాయి. వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. అదేమిటో చూద్దాం.

ఇప్పుడు సరిహద్దు పోరాటం జరుగుతున్న ప్రాంతం కారకోరం-హిమాలయాల పర్వతశ్రేణి ప్రాంతం. దానికి ఆవల వుత్తరం వైపు చైనా కి చెందిన జింజియాంగ్ ప్రావిన్సు పూర్తి ఎడారి ప్రాంతం. అక్కడ నీటికొరత సహజంగానే ఎక్కువ. కానీ ఆ ప్రాంతాన్ని కీలకమైన ప్రాంతంగా మలుచుకుంటుంది చైనా. ఆక్సాయ్ చిన్ ఉత్తరప్రాంతం లో అణ్వాయుధాల ప్రయోగ ప్రాంతంగా వాడుకుంటుంది. అలాగే దగ్గరలోని కష్గర్ పట్టాన సమీపంలో జి సి ఎల్ పాలీ ఎనర్జీ హోల్డింగ్స్ కంపెనీ 130 వేల మెట్రిక్ టన్నుల మైక్రో చిప్ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రో చిప్ తయారీ కేంద్రాల్లో ఒకటి. మరి వీటన్నింటికి సమృద్ధిగా నీళ్ళు కావాలి. మైక్రో చిప్ ఉత్పత్తి కి ఒక్క చిప్ కే పది వేల లీటర్ల నీళ్ళు కావాల్సి వుంటుంది.

1954 లో ఆక్సాయ్ చిన్ ని ఆక్రమించినా , 1963 లో షాక్ షాగం ని పాకిస్తాన్ నుంచి అక్రమంగా సంపాదించినా అసలు కారణం నీళ్ళ కోసమే. షాక్ షాగం లోయని పాకిస్తాన్ నుంచి సంపాదించినా 1984 లో సియాచిన్ గ్లాసియర్ ని భారత్ పూర్తి అదుపులోకి తెచ్చుకోవటంతో చైనా ఆటలకు బ్రేక్ పడింది. దానితోపాటు కిషెన్ గంగ డాం ని భారత్ నిర్మించటం తో కూడా కొంత చైనా కి ఇబ్బందిగా వుంది. గల్వాన్ నదీ ప్రాంతం నుండి దౌలత్ బేగ్ ఒల్దీ కి భారత్ రోడ్ నిర్మాణం చేయటం తో చైనా కు భయం పట్టుకుంది. భారత్ కూడా వ్యూహాత్మకంగా పనులు చేపట్టటంతో ముందు ముందు కావలసినన్ని మంచి నీళ్ళ కు ఇబ్బండులేర్పడతాయని భావిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని తనకిన్డకు తెచ్చుకుంటే ముందు ముందు కూడా మంచి నీళ్ళకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు అని ఎత్తుగడ వేసింది. భారత్ ఈ ఎత్తుగడలను పసిగట్టి ప్రతి వ్యూహాలు రచించటం తో చైనా ఆటలు సాగటం లేదు. 1962 భారత్ కి , 2020 భారత్ కి పోలిక లేదని చైనా గ్రహిస్తే మంచిది.