https://oktelugu.com/

పుష్ప అడవిలో సెట్‌ కాదని.. అన్నపూర్ణలో సెట్‌ చేస్తున్న సుకుమార్

చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి మామూలుగా దెబ్బతీయలేదు. ఈ వైరస్‌ ధాటికి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి. షూటింగ్స్‌, సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక కూడా రెండు నెలలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో టాలీవుడ్‌లో ఈ మధ్యే కొన్ని మూవీల చిత్రీకరణలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ, అవన్నీ చిన్నాచితక చిత్రాలే. భారీ తారాగణం ఉండే పెద్ద సినిమా విషయంలో దర్శక, నిర్మాతలు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కరోనా […]

Written By:
  • admin
  • , Updated On : June 18, 2020 3:21 pm
    Follow us on


    చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి మామూలుగా దెబ్బతీయలేదు. ఈ వైరస్‌ ధాటికి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి. షూటింగ్స్‌, సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక కూడా రెండు నెలలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో టాలీవుడ్‌లో ఈ మధ్యే కొన్ని మూవీల చిత్రీకరణలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ, అవన్నీ చిన్నాచితక చిత్రాలే. భారీ తారాగణం ఉండే పెద్ద సినిమా విషయంలో దర్శక, నిర్మాతలు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ షూటింగ్స్‌కు వెళ్లి రిస్క్‌ చేసేందుకు వెనకడుగేస్తున్నారు. అందులో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌తో స్టార్ డైరెక్టర్ రూపొందిస్తున్న ‘పుష్ప’ కూడా ఒకటి.

    గంధం చెక్కల స్మగ్లింగ్‌, ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను కేరళలోని అడవుల్లో పూర్తి చేశారు. రెండో షెడ్యూల్‌ను కూడా అక్కడే ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌కు అనూహ్యంగా బ్రేక్‌ పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు వెళ్లి షూటింగ్‌ చేసే అవకాశం లేదని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయానికి వచ్చాడట. దాంతో, ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక అడవిలో షూట్‌ చేయాలని భావించారట. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో కూడా కరోనా ప్రభావం అధికంగా ఉంది. తెలంగాణలో ఏదో ఒక అడవిని ఎంచుకుందామన్నా.. ఇక్కడా వైరస్‌ ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో తెలిసిందే. దాంతో, షూటింగ్‌ కోసం వేరే ప్రాంతానికి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదని సుక్కూ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. హైదరాబాద్‌ అన్నపూర్ణ సెట్‌లోనే అడవి సెట్‌ వేసి షూటింగ్‌ చేయాలని డిసైడనట్టు టాలీవుడ్‌ టాక్‌. ‘రంగస్థలం’లో కొంతభాగాన్నే గోదావరి జిల్లాల్లో చిత్రీకరించాడు. నది, విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మిగతా మొత్తాన్ని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో తీశాడు. గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్‌ సాయం తీసుకున్నాడు. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా దాన్నే ఫాలో కావాలని సుకుమార్ నిర్ణయం తీసుకున్నాడట. అయితే, ప్రతీ సీన్‌ను సుక్కూ ఫుల్‌ పర్ఫెక్షన్‌తో తీస్తాడు. మరి స్టూడియోలో అడవి సెట్‌ వేస్తే నేచురాలటీ మిస్‌ అయ్యే ప్రమాదం ఉంది. సహజత్వం కావాలంటే ఎక్కువ గ్రాఫిక్స్‌ అవసరం అవుతాయి. ఆటోమేటిక్‌గా బడ్జెట్‌ పెరుగుతుంది. మరి, కరోనా టైమ్‌లో ఖర్చులు తగ్గించుకుంటున్న నిర్మాతలు దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.