King Charles III Coronation: బ్రిటన్ రాజుకు… ముంబై డబ్బావాలాల అరుదైన కానుక: మురిసిపోయిన చార్లెస్_3

శనివారం లండన్ లో పట్టాభిశిక్తుడు కానున్న బ్రిటన్ రాజుకు ముంబై డబ్బా వాలాలు "పునేరే పగఢీ" దీనినే సంప్రదాయ తలపాగా అంటారు.. దీనిని ఆయనకు తమ బహుమతిగా అందించారు. దీంతోపాటు మెడలో ధరించే కండువా లేదా ఉపర్నీ ని పంపించారు.

Written By: Bhaskar, Updated On : May 5, 2023 12:47 pm
Follow us on

King Charles III Coronation: రాజంటే రాజే. ఆయనకు ఎక్కడ ఉన్నా గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. రాజ లాంఛనాలకు తిరుగుండదు. ముఖ్యంగా బ్రిటన్ రాజ వంశీయులకు అయితే ఈ విషయంలో మరిన్ని గౌరవ మర్యాదలు దక్కుతాయి. క్వీన్ ఎలిజబత్ కన్నుమూసిన నేపథ్యంలో మే ఆరవ తేదీన ప్రిన్స్ చార్లెస్_3 పట్టాభిషిక్తుడు కానున్నాడు. ఈ సందర్భంగా బ్రిటన్ లో కనివిని ఎరగని స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారధులందరినీ పిలిచారు. వారికి బ్రిటన్ లోని ప్రత్యేక హోటలల్లో వసతులు కల్పించారు. వసతులు కల్పించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ప్రిన్స్ చార్లెస్ భారతదేశం నుంచి అందుకున్న కానుక అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.

అదేమిటంటే

శనివారం లండన్ లో పట్టాభిశిక్తుడు కానున్న బ్రిటన్ రాజుకు ముంబై డబ్బా వాలాలు “పునేరే పగఢీ” దీనినే సంప్రదాయ తలపాగా అంటారు.. దీనిని ఆయనకు తమ బహుమతిగా అందించారు. దీంతోపాటు మెడలో ధరించే కండువా లేదా ఉపర్నీ ని పంపించారు. మహారాష్ట్రలోని పూణే నగరంలో 19వ శతాబ్దం నుంచి హోదాకు, ప్రతీకగా పునేరే పగఢీ ని ధరిస్తారు. సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఉపర్నిని పురుషులు ధరిస్తారు.” రాజు పట్టాభిషేకానికి మమ్మల్ని పిలువలేదు. ఇటీవల ముంబై నగరంలో హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మాలో కొంత మందిని బ్రిటన్ దౌత్యాధికారులు పిలిచారు. ఈ సందర్భంగా వారికి పునేరే పగఢీ, ఉపర్నిని అందజేశామని” ముంబై నగరానికి చెందిన డబ్బా వాలాల సంఘం అధ్యక్షుడు రామ్ దాస్ కార్వాండే వివరించారు.

ఈనాటిది కాదు

ముంబై డబ్బా వాలాలకు, బ్రిటన్ రాజ కుటుంబానికి సంబంధాలు ఈనాటివి కావు. ఆ కుటుంబంతో వారికి సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 2003లో చార్లెస్ _3 భారత్ వచ్చినప్పుడు వారిని కలుసుకున్నారు. వారితో చాలాసేపు మాట్లాడారు. వారు చేస్తున్న సేవలు గురించి తెలుసుకున్నారు. ఇక అప్పటినుంచి వారితో టచ్ లో ఉంటున్నారు. అంతేకాదు బ్రిటన్ దౌత్యాధికారులతో వారి యోగ క్షేమాలను కనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ముంబై డబ్బా వాలాలు ప్రిన్స్ చార్లెస్ కి పంపిన కానుకలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇదే చివరిది కావాలి

పట్టాభిషేకం శనివారం జరుగుతున్న నేపథ్యంలో చార్లెస్ వ్యతిరేక గ్రూప్ గట్టిగా బదులిస్తోంది.. రిపబ్లిక్ సీఈవో గ్రహం స్మిత్ ” నాట్ మై కింగ్” అనే నినాదం సర్వత్రా వినిపిస్తోందని స్పష్టం చేశారు. వెయ్యి సంవత్సరాల రాజరికానికి ముగింపు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ” ఇది అవినీతికర సంస్థకు చేస్తున్న పండుగ. పైసా కూడా సంపాదించని వ్యక్తికి జరుగుతున్న వేడుక. ఇటీవల బ్రిటన్ లో నిర్వహించిన సర్వే లోనూ 20% మంది ఇదే విషయాన్ని చెప్పారు.” అని స్మిత్ వెల్లడించారు.

రాజు కోరిక అదే

ఇక ప్రిన్స్ చార్లెస్ కు భారతదేశాన్ని సందర్శించాలనే కోరిక అమితంగా ఉంది. ఈ మేరకు ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. ఈ వివరాలను బ్రిటన్ లో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్నుడు లార్డ్ కరణ్ బిల్మోరియా తెలిపాడు. మంగళవారం అక్కడి పార్లమెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్, సంబంధాల గురించి తెలిపాడు. సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాల గురించి రాజుకు చెప్పే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రాజు భారత దేశంలో పర్యటించాలని అనుకుంటున్నారని అతడు వివరించాడు.