Pilli Subhas Chandra Bose : ఏం మంత్రం వేశావు జగన్?

ముఖ్యమంత్రి జగన్ కి అన్ని విషయాలు వివరించామని.. టికెట్లపై సర్వే చేయించి మంచి నిర్ణయం తీసుకుంటాను అని సీఎం హామీ ఇచ్చారని.. గిరి గిసుకుని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూర్చోడు. మా పని మేము చేసుకుంటాం ఆయన పని ఆయన చేసుకుంటారని ఎంపీ బోస్ తెలిపారు.

Written By: NARESH, Updated On : July 25, 2023 9:41 pm
Follow us on

Pilli Subhas Chandra Bose : వైసీపీలో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన ఎంపీ సుభాష్ చంద్రబోస్ అసమ్మతి గళం నేడు మూగబోయింది. ఏపీ సీఎం జగన్ రంగంలోకి దిగి లెఫ్ట్ రైట్ ఇవ్వడంతో మంత్రి చెల్లుబోయిన వేణుతో పంచాయితీ పెట్టుకున్న ఎంపీ సుభాష్ చంద్రబోస్ వెనక్కి తగ్గారు. మంత్రి వేణుతో వివాదాలు పరిష్కరించుకుంటామని.. టికెట్ విషయంలో సీఎం జగన్ సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో మంత్రి వేణు, ఎంపీ బోస్ మధ్య వివాదం సద్దుమణిగింది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎంపీ బోస్ విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీలో అసమ్మతికి తెరదించారు. అధిష్టానం మందలింపుతో వెనక్కి తగ్గిన ఎంపీ బోస్, తనయుడు సూర్య ప్రకాష్ పార్టీకి కట్టుబడి ఉంటామని తెలిపారు.

ఈ సందర్భంగా అసమ్మతి రాజేసినందుకు జగన్ క్లాస్ పీకడంతో బోస్ లెంపలేసుకున్నారు. ‘క్షమించండి కార్యకర్తల ఇబ్బందులు, మనోభావాలు దృష్టిలో పెట్టుకునే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నానని కవర్ చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీలవైపు పెళ్లే ప్రసక్తే లేదు. కార్యకర్తల్లో ధైర్యం నింపే బాధ్యత నాపై ఉంది అందుకే రాజీనామా చేస్తానన్నానన్నారు.

ముఖ్యమంత్రి జగన్ కి అన్ని విషయాలు వివరించామని.. టికెట్లపై సర్వే చేయించి మంచి నిర్ణయం తీసుకుంటాను అని సీఎం హామీ ఇచ్చారని.. గిరి గిసుకుని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూర్చోడు. మా పని మేము చేసుకుంటాం ఆయన పని ఆయన చేసుకుంటారని ఎంపీ బోస్ తెలిపారు.

పార్టీలో పని చేయడానికి నిబంధనలు ఎవరికి ఏమి లేవు ముఖ్యమంత్రి జగన్ టీములు దించారు. ప్రత్యేక టీములు ఆధారంగా టికెట్ ఉంటుంది. విషయాన్ని పెద్ద చేయొద్దు సర్వే నివేదిక ద్వారా టిక్కెట్ ఇస్తాంఅని సీఎం అన్నారని తెలిపారు.

ఇలా వైసీపీలోని అసమ్మతిని ఆదిలోనే తుంచేసి ఎన్నికల వేళ హీట్ పెరగకుండా జగన్ తెరదించారు. ఒక్క మీటింగ్ తోనే ఎంపీ బోస్ అసమ్మతిని చల్లార్చాడంటే ఏం మంత్రం వేశాడో అని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.  మరి మంత్రి వేణు చల్లబడుతారా? బోస్ తో కలిసి పనిచేస్తారా? టికెట్ల లొల్లి ఎలా ముగుస్తుందో చూడాలి.