https://oktelugu.com/

చంద్రబాబును ఎన్టీఆర్ తో కొడుతున్న జగన్

చంద్రబాబు చరిత్రలో ఆయన మామ ఎన్టీఆర్ ది కీలకరోల్.. బాబుకు పిల్లనివ్వడం దగ్గర నుంచి పార్టీలోకి తీసుకోవడం.. అదే పార్టీని చంద్రబాబు లాక్కోవడం.. మామ మరణానికి కారణం అవ్వడం.. ఇప్పుడు నందమూరి వాసనే లేకుండా తెలుగుదేశాన్ని ఏలడం.. ఇలా మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఉనికిని చంద్రబాబు ఎప్పుడూ వదలుకోలేని పరిస్థితి. అలా అని ఆయనను నెత్తిన పెట్టుకోని దుస్థితి. అందుకే ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2020 / 12:00 PM IST
    Follow us on

    చంద్రబాబు చరిత్రలో ఆయన మామ ఎన్టీఆర్ ది కీలకరోల్.. బాబుకు పిల్లనివ్వడం దగ్గర నుంచి పార్టీలోకి తీసుకోవడం.. అదే పార్టీని చంద్రబాబు లాక్కోవడం.. మామ మరణానికి కారణం అవ్వడం.. ఇప్పుడు నందమూరి వాసనే లేకుండా తెలుగుదేశాన్ని ఏలడం.. ఇలా మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఉనికిని చంద్రబాబు ఎప్పుడూ వదలుకోలేని పరిస్థితి. అలా అని ఆయనను నెత్తిన పెట్టుకోని దుస్థితి. అందుకే ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం అంటుంటారు టీడీపీ నేతలు.

    ఇప్పుడు అదే ఎన్టీఆర్ తో చంద్రబాబును కొట్టే ప్లాన్ ను సీఎం జగన్ సిద్ధం చేస్తున్నారని తెలిసింది. అన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి మామ ఎన్టీఆర్ ను గౌరవించని చంద్రబాబును అందరి ముందు దోషిగా నిలబెట్టేలా వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం.

    Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

    ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ఏపీలోని 13 జిల్లాలను పునర్విభజన చేసి 25 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు కమిటీని నియమించారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో ఆసక్తికర డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు మరోమారు తెరపైకి తెచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతానని కృష్ణ జిల్లా పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారని.. ఖచ్చితంగా ఆయన ఈసారి నెరవేరుస్తారని వంశీ స్పష్టం చేశారు.

    కృష్ణ జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ సినీ, రాజకీయాల్లో ధ్రువతారగా ఎదిగారు. అలాంటి ఆయనను టీడీపీ దాదాపు వదిలేసింది. టీడీపీ వదిలేసిన ఆ తెలుగు మహనీయుడిని వైసీపీ తెరపైకి తెచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బకొట్టాలని వ్యూహం పన్నింది. అందుకే వ్యూహాత్మకంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ ద్వారా ఈ డిమాండ్ ను లేవనెత్తారు. జగన్ ఆల్ రెడీ హామీ ఇవ్వడంతో దీన్ని నెరవేర్చడం గ్యారెంటీ..

    Also Read: ట్వీట్లకు ఓట్లు రాలుతాయా లోకేష్..?

    ఇలా చంద్రబాబును ఏ దశలోనూ వదలకుండా వ్యూహాత్మకంగా ఆయన లోపాలను ఎత్తిచూపుతూ ముప్పేట దాడి చేసేలా ప్రతీ అవకాశాన్ని వైసీపీ అధినేత జగన్ వాడుకుంటుండడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

    -నరేశ్ ఎన్నం