https://oktelugu.com/

ఆగస్టు 15న కరోనా వ్యాక్సిన్ గురించి అద్భుతమైన మాట చెప్పిన మోడీ…!

భారతదేశం తన 74 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా…. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ…. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా…. టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్యను భారీగా పెంచినట్లు తెలిపారు. అలాగే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు అవసరమైన మాస్కులు, రక్షణ హెల్మెట్లు ను కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నామని…. శాస్త్రవేత్తలంతా వ్యాక్సిన్ తయారీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 15, 2020 / 11:17 AM IST
    Follow us on

    భారతదేశం తన 74 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా…. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ…. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా…. టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్యను భారీగా పెంచినట్లు తెలిపారు. అలాగే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు అవసరమైన మాస్కులు, రక్షణ హెల్మెట్లు ను కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నామని…. శాస్త్రవేత్తలంతా వ్యాక్సిన్ తయారీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు అని తెలిప్పారు.

    Also Read: అక్కడ ఎన్ 95 మాస్కులు నిషేధం.. కారణం ఏంటంటే?

    ప్రస్తుతం భారతదేశంలో ఒకటికి మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్ స్థాయి దాటి టెస్టింగ్ స్టేజి లోకి ప్రవేశించినట్లుగా మోడీ తెలపడం గమనార్హం. ఇక శాస్త్రవేత్తల నుండి ఒక్క గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే మాత్రం భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సదుపాయాలన్నింటినీ సమకూర్చుకుంటున్నట్లు మోడీ వివరించారు. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించే సమయానికి భారతదేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉందని…. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 1400 కి వెళ్లడం గమనార్హం అని ఆయన అన్నారు. ఇక 130 కోట్ల భారతీయులందరూ ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

    Also Read: కరోనాకు చెక్ పెడుతున్న మాస్కు ఇదేనట?

    ‘ఆత్మ నిర్భర్ భారత్’ గురించి మోడీ మాట్లాడుతూ “ఇప్పుడు మన వ్యాక్సిన్ మనమే తయారు చేసుకుంటున్నాం…. అంతేకాకుండా గతంలో n95 మాస్క్ లను లను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న మనం ఇప్పుడు భారీ సంఖ్యలో వాటితోపాటు పిపీఈ కిట్లను, వెంటిలేటర్ లను కూడా ఇతర దేశాలకు అందిస్తున్నాం.. మన ప్రభుత్వ హయాంలో దేశం యొక్క వైద్య రక్షణకే పెద్ద పీట వేసింది” అని మోడీ తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రష్యా వారు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టకుండానే మనుషులకు వ్యాక్సిన్ ను వేయడం అన్నది చూస్తున్నాం. దాని రిజల్ట్ ఎలా ఉందో తెలిసేలోపు…. భారత్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని పలువురు ఆశావహంగా ఉన్నారు.