మన కథల పై వాళ్లకు మోజు ఎక్కువ !

ఒకప్పుడు ఎక్కువగా బాలీవుడ్ కథలు సౌత్ ఇండస్ట్రీలో రీమేక్ అవుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. సౌత్ కథల శైలి మారింది. అన్నిటికి మించి సౌత్ లో మంచి కథకులు పుట్టుకొచ్చారు. యావత్తు భారతీయ సినీ పరిశ్రమలోనే ఇప్పుడు సౌత్ లో ఉన్న టాలెంట్ నార్త్ లో లేదు. అందుకే గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నిర్మాతల చూపు సౌత్ సినిమాల స్టోరీల పై పడిందనేది వాస్తవం. దీనికి తోడు సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ లో […]

Written By: admin, Updated On : August 15, 2020 11:31 am
Follow us on


ఒకప్పుడు ఎక్కువగా బాలీవుడ్ కథలు సౌత్ ఇండస్ట్రీలో రీమేక్ అవుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. సౌత్ కథల శైలి మారింది. అన్నిటికి మించి సౌత్ లో మంచి కథకులు పుట్టుకొచ్చారు. యావత్తు భారతీయ సినీ పరిశ్రమలోనే ఇప్పుడు సౌత్ లో ఉన్న టాలెంట్ నార్త్ లో లేదు. అందుకే గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నిర్మాతల చూపు సౌత్ సినిమాల స్టోరీల పై పడిందనేది వాస్తవం. దీనికి తోడు సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ లో రీమేక్ చేస్తే.. సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఆ కారణంగానే మన దగ్గర హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి అక్కడి నిర్మాతలు తెగ ఉబలాట పడుతున్నారు.

Also Read: పూజా హెగ్డే డబుల్ రోల్ అట !

ఈ క్రమంలోనే ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించింది.. అలాగే తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’, ఎవడు సినిమాలు అక్కడ రీమేక్ చేస్తుంటే.. వాటి పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మన దగ్గర పెద్ద ప్లాప్. కానీ బాలీవుడ్ లో ఆ సినిమాని అర్జున్ కపూర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్లాప్ సినిమా రైట్స్ ను కూడా వాళ్ళు తెగ ఇష్టపడి కొనుక్కుని మరీ రీమేక్ చేస్తున్నారంటే.. మన కథలు వాళ్లకు ఎంత మోజు ఉందో అని.

Also Read: ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !

అన్నట్టు ఈ కరోనా అనంతరం మరొక తెలుగు సినిమా కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అదే ‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఇక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టి.. ప్లాప్ ల్లో మునిగిపోయిన రామ్, పూరిల సినీ కెరీర్ కి మళ్ళీ ఊపు తీసుకొచ్చింది. మరి రణ్ వీర్ సింగ్ కి కూడా ఈ సినిమా ఆ రేంజ్ హిట్ ని ఇస్తుందేమో చూడాలి. ఇప్పటికే రణ్ వీర్ సింగ్ ఎన్టీఆర్ టెంపర్ ను రీమేక్ చేసుకుని బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టాడు.