పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?

ప్రస్తుతం నడుస్తున్నది కరోనా కాలం.. ఈ కాలంలోనూ ఒక పని మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుండటం విశేషం. అది ఏంటంటే.. చరిత్ర సాక్ష్యాలుగా ఉన్న భవనాల కూల్చివేతలు. ఇది ఒకింత బాధ కలిగించే విషయమే అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం తాము చేయాలకున్న పనులను మాత్రం పకడ్బంధీగా చేసుకుంటూ పోతున్నాయి. దీంతో ఒకప్పుడు గొప్ప కట్టడాలుగా కీర్తించబడిన భవనాలు నేడు కూల్చివేతలకు గురవుతున్నాయి. పురాతన కట్టడాలని కాపాడాల్సిన ప్రభుత్వాలే శిథిలావస్థకు చేరుకున్నాయనే సాకుతో కూల్చివేసేందుకు సిద్ధమవుతుండటం శోచనీయంగా […]

Written By: Neelambaram, Updated On : July 29, 2020 6:56 pm
Follow us on


ప్రస్తుతం నడుస్తున్నది కరోనా కాలం.. ఈ కాలంలోనూ ఒక పని మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుండటం విశేషం. అది ఏంటంటే.. చరిత్ర సాక్ష్యాలుగా ఉన్న భవనాల కూల్చివేతలు. ఇది ఒకింత బాధ కలిగించే విషయమే అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం తాము చేయాలకున్న పనులను మాత్రం పకడ్బంధీగా చేసుకుంటూ పోతున్నాయి. దీంతో ఒకప్పుడు గొప్ప కట్టడాలుగా కీర్తించబడిన భవనాలు నేడు కూల్చివేతలకు గురవుతున్నాయి. పురాతన కట్టడాలని కాపాడాల్సిన ప్రభుత్వాలే శిథిలావస్థకు చేరుకున్నాయనే సాకుతో కూల్చివేసేందుకు సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది.

Also Read: కన్నా లక్ష్మీనారాయణ అడుగులు ఎటువైపు?

తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలంచారు. ఈమేరకు ఆయన కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.500కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించేందుకు సిద్ధపడటంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. సచివాలయం కూల్చివేత అంశం సస్పెన్స్ థిల్లర్ ను తలపించేలా నడిచింది. చివరకు హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఇటీవలే సచివాలయం కూల్చివేత పనులను చేపట్టింది.

మరోవైపు సచివాలయం కూల్చివేతను కవర్ చేసేందుకు మీడియాకు అనుమతించకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తాయి. దీనిపై కూడా హైకోర్టు విచారణ చేపట్టి మీడియా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం నిజాం రహస్య నిధిని కొల్లగొట్టేందుకే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపణలు గుప్పించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో కరోనా విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ సచివాలయ కూల్చివేత పనులు చేపట్టడంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కేసీఆర్ సచివాలయం నిర్మాణ విషయంలో పట్టుదలతో ముందుకెళుతున్నారు.

Also Read: బండి సంజయ్ కి లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ

తాజాగా కేంద్రం ప్రభుత్వం కూడా పార్లమెంట్ భవనాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని భావిస్తోంది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడున్న పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని.. భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని, ఇప్పుడున్న సాంకేతికతకు అనుగుణంగా సదుపాయాల్లేవని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీనిని కూల్చేసి ఈ ప్రాంతంలోనే నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో ప్రారంభంకాగా 1937లో ముగిసింది. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ భవనాన్ని భవితరాలకు అందించాల్సిన నేతలే కూల్చివేసేందుకు సిద్ధమవుతుండటం శోచనీయమనే చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయాన్ని కూల్చేందుకు ఎలాంటి ప్రణాళికలు అనుసరించారో మోడీ సర్కార్ కూడా అలాగే ముందుకు వెళుతుండటం గమనార్హం. ఈ విషయంలో కేసీఆర్ ను మోడీ ఆదర్శంగా తీసుకున్నట్లు కన్పిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం మాత్రం పార్లమెంట్ భవనాన్ని కూల్చివేసేందుకు రెడీ అవుతుంది. దీంతో ఒక అద్భుత కట్టడం కాలగర్భంలో కలిసిపోనుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.