మోదీ.. ప్రైవేటు ‘మంత్రం’

మేకిన్ ఇండియా పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. మొదటి ఐదేళ్లు సంస్కరణలు.. బ్లాక్ మనీని వెలికితీస్తామని చెప్పుకొచ్చిన చాయ్ వాలా.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రయివేటు మంత్రం జపిస్తున్నారు. నీతి అయోగ్ సమావేశంలో సీఎంలకు సైతం ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. నిజానికి బీజేపీ ప్రభుత్వానిది మొదటి నుంచి ఇదే విధానం. ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిస్తేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని కాషాయ పార్టీ గట్టిగా నమ్ముతోంది. దీనిపై పెద్దగా […]

Written By: Srinivas, Updated On : February 21, 2021 3:12 pm
Follow us on


మేకిన్ ఇండియా పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. మొదటి ఐదేళ్లు సంస్కరణలు.. బ్లాక్ మనీని వెలికితీస్తామని చెప్పుకొచ్చిన చాయ్ వాలా.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రయివేటు మంత్రం జపిస్తున్నారు. నీతి అయోగ్ సమావేశంలో సీఎంలకు సైతం ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. నిజానికి బీజేపీ ప్రభుత్వానిది మొదటి నుంచి ఇదే విధానం. ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిస్తేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని కాషాయ పార్టీ గట్టిగా నమ్ముతోంది. దీనిపై పెద్దగా వ్యతిరేకత కూడా రావడం లేదు.

Also Read: పెట్రో ధ‌ర‌ల సెంచ‌రీ.. గ‌త ప్ర‌భుత్వాల‌‌పై నె‌ట్టేసిన‌ మోడీ.. అందులో నిజ‌ముందా‌?

ప్రయివేటు రంగంలో కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించవచ్చు.. కానీ.. ప్రభుత్వ సంస్థలను వాటికి అప్పగించి ప్రోత్సహించడం సరికాదని కొందరు అంటున్నారు. స్టీల్ ప్లాంటును వందశాతం అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు చర్చ తీవ్రమైంది. అయితే స్టీల్ ప్లాంటు అనేది చాలా లాభదాయకమైన ప్రాజెక్టు. సొంతంగా గనులు లేకపోవడంతో సమస్య వస్తోంది. ప్రభుత్వం తలుచుకుంటే ఒక్కరోజులో కంపెనీని లాభాల బాటలో నడిపించొచచ్చు. కానీ అదంతా ఆలోచించన కేంద్రం స్టీలు ప్లాంటును ప్రయివేటుకు కట్టబెట్టాలని చూస్తోంది.

Also Read: బీజేపీ నెత్తిన పెట్టుకున్న చత్రపతి శివాజీ హిందుత్వ వాది కాదా? చరిత్ర ఏం చెబుతోంది?

ఇలాంటి ప్రయివేటీకరణనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు వందల ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. వాటి విలువ ఇప్పుడు లక్షల కోట్లలో ఉంటుంది. సంస్థను కొనుగోల చేసి ప్రయివేటు వ్యక్తులు.. ఫ్యాక్టరీని మూసేని.. స్థలాలను అమ్మకోవడంతోనే సమస్య వస్తోంది. హిందూస్థాన్ జింక్ విషయంలోనూ ఇదే జరిగింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుకు అప్పగించితే.. వారుమరో విధంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

స్టీల్ ప్లాంటును తీసుకునే పోస్కో కానీ… మరోటి కానీ.. లాభాల్లోకి రావాలంటే.. సొంతంగా గనులు ఉండాలి. లేకుంటే ఆ సంస్థకు నష్టాలు వస్తాయి. మరి ఆ సంస్థ ఎలా ముందుకు వెళ్తుంది..? అయితే ప్రభుత్వమే గనులు కేటాయించాలి. లేదా.. ఆ సంస్థ భూములు అమ్మేసుకుని రియల్ ఎస్టేల్ దందా చేయాల్సి ఉంటుంది. రైల్వేతో సహా మొత్తంగా ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటీకరణకు మోదీ పచ్చజెండా ఊపారు. ఇప్పటికే రైళ్లు చాలా వరకు ప్రయివేటు చేతికి వెళ్లాయి. మరికొన్ని కంపెనీలు కూడా త్వరలో ప్రయివేటు పరం కాబోతున్నాయి.