https://oktelugu.com/

అద్భుతం.. అరుణ గ్రహం దృశ్యం

అంగారకుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక పర్సెవరెన్స్ తాజాగా అద్భుతమైన ఫొటోలు పంపించింది. ల్యాండింగ్ కు సంబంధించిన సంక్లష్ట ప్రక్రియను తొలిసారి అత్యంత సమీపంలో నుంచి చిత్రీకరించింది. పర్సెవరన్స్ రోవర్ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు.. రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వాటిలో పలు కెమెరాలను ల్యాండింగ్ సమయంలోనే ఇంజినీర్లు ఆన్ చేశారు. రాకెట్లతో నడిచే స్కై క్రేన్ యంత్రం తాళ్లసాయంతో రోవర్ ను అంగారక ఉపరితలంపై […]

Written By: , Updated On : February 21, 2021 / 01:20 PM IST
Follow us on

Mars
అంగారకుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక పర్సెవరెన్స్ తాజాగా అద్భుతమైన ఫొటోలు పంపించింది. ల్యాండింగ్ కు సంబంధించిన సంక్లష్ట ప్రక్రియను తొలిసారి అత్యంత సమీపంలో నుంచి చిత్రీకరించింది. పర్సెవరన్స్ రోవర్ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు.. రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వాటిలో పలు కెమెరాలను ల్యాండింగ్ సమయంలోనే ఇంజినీర్లు ఆన్ చేశారు. రాకెట్లతో నడిచే స్కై క్రేన్ యంత్రం తాళ్లసాయంతో రోవర్ ను అంగారక ఉపరితలంపై సాఫీగా దించింది.

దానికి ముందు నేల నుంచి రెండు మీటర్ల ఎత్తులో తాళ్లకు వేలాడుతున్న రోవర్ దృశ్యం కనువిందు చేస్తోంది. రాకెట్ల నుంచి వెలువడిన జ్వాలల తాడికి పైకి ఎగిసిన ఎర్రటి అంగాకర ధూళి కూడా అందులో కనిపించింది. రానున్న రోజుల్లొ ల్యాండింగ్ కు సంబంధించిన మరిన్ని ఫొటోలు, ఆడియో రికార్డులను వెలవరిస్తామని నానా తెలిపింది. మరో ఫొటోలో రోవర్ చక్రం, రంధ్రాలమయంగా ఉన్న కొన్ని రాళ్లు కనిపించాయి. చదునైన ప్రాంతానికి సంబంధించిన ఫోటో కూడా నాసా చేతికి చిక్కింది.

నిర్దేశిత రీతిలో అంగారకుడి ఉపరితలంపై ఉన్న జెజెరో బిలంలోని సురక్షితమైన ప్రాంతంలోనే వర్సెవరెన్స్ దిగిందని నాసా అధికారులు చెబుతున్నారు. రోవర్లో స్వల్పంగా 1 డిగ్రీ ఒరుగుదల మాత్రమే ఉందని తెలిపారు. దగ్గర్లో చిన్నచిన్న రాళ్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. రోవర్లోని అన్ని వ్యవస్థలూ సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. రోవర్ ముందుకు కదలడానికి కనీసం ఒక వారం సమయం పట్టే అవకావం ఉందని అన్నారు.

అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా.. అన్నది నిర్ధారించడానికి నాసా ఈ రోవర్ ను పంపిన సంగతి తెలిసిందే. జెజెరో బిలంలోని ఒక భాగంలో వందల కోట్ల ఏళ్ల కిందట నదీ డెల్టా ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ పురాతన జీవనానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పర్సెవరెన్స్ దిగిందని నాసా తెలిపింది.