https://oktelugu.com/

సీఐఎస్‌ఎఫ్ శుభవార్త.. భారీ వేతనంతో 2,000 ఉద్యోగాలు..?

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది 2000 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం సీఐఎస్‌ఎఫ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ ఉద్యోగాలకు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కాదు. కేవలం ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. https://www.cisf.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 21, 2021 1:30 pm
    Follow us on

    సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది 2000 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం సీఐఎస్‌ఎఫ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ ఉద్యోగాలకు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కాదు. కేవలం ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

    https://www.cisf.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ఎస్సై ఉద్యోగ ఖాళీలు 63, ఏఎస్సై ఉద్యోగ ఖాళీలు 187, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 424, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 1326 ఉన్నాయి. ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

    ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఈ మెయిల్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.cisf.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.

    50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్ ఆర్మీ సిబ్బందికి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభించనుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.