
ఏపీలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. జగన్ సర్కార్ ధాటికి టీడీపీ నేతలు సైలంటవడంతో బీజేపీ నేతలు వైసీపీకి ప్రత్యామ్నాయం మారేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏపీలోనూ హిందువులను ఏకతాటిపై తీసుకొచ్చేలా బీజేపీ సన్నహాలు చేసుకుంటూ ముందుకెళుతోంది.
ఈ క్రమంలోనే బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఏపీలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు.. తిరుపతి డిక్లరేషన్ పై ఇరుపార్టీల మధ్య కౌంటర్.. ఎన్ కౌంటర్ ల మాటల తూటలు పేలితున్నాయి. సీఎం జగన్ తిరుపతిని సందర్శించినపుడు డిక్లేషన్ ఇవ్వాల్సిందేనంటూ బీజేపీ పట్టుబడుతోంది. దీనిపై మంత్రి నాని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా పరిపూర్ణనంద స్వామి సైతం మంత్రి నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మంత్రి నానికి చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హిందువుల మనోభావాలను గౌరవించకుంటే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు ధీటుగా తాజాగా మరోసారి మంత్రి నాని బీజేపీ నేతలపై ఫైరయ్యారు.
హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరికీ స్పష్టత ఇవ్వాలని పనిలేదని మంత్రి నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని బీజేపీ వ్యాఖ్యనించడంపై మండిపడ్డారు. పదిమందిని వెంటబెట్టుకెళ్లి అమిత్ షా, కిషన్ రెడ్డిని తొలగించమంటే తొలగిస్తారా?.. రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాటాలు హస్యాస్పదంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ తన సతీమణిని రామాలయంలో పూజలు చేసేందుకు తీసుకెళ్లమనండి.. మోదీ.. యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్లారు.. జగన్ మాత్రం కుటుంబ సమేతంగా ఆలయాలకు రావాలా? అంటూ ప్రశ్నించారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయ్యాకే ఏపీలోని ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అంటే ఆయన్ని తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకుంటే మంచిదని బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.