
టైం మ్యాగజైన్ 2020 సంవత్సరానికి విడుదల చేసిన అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో నరేంద్ర మోడీ మరోసారి చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో మోడీ చోటు సంపాదించుకోవడం 4వ సారి కావడం ఆసక్తికరం. ఈ జాబితాలో గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ షాహినాభాగ్ లో జరిగిన ఆందోళనను ముందుండి నడిపించిన బిల్కిస్ కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో ట్రంప్, సుందర్ పిచ్చాయ్, కమల హ్యారిస్, జింపింగ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా చోటు సంపాదించుకున్నారు.