Homeజాతీయ వార్తలుMIM Corporator: పోలీసులను తిట్టిన ఎంఐఎం కార్పొరేటర్.. డీజీపీకి సంచలన ఆదేశాలిచ్చిన కేటీఆర్

MIM Corporator: పోలీసులను తిట్టిన ఎంఐఎం కార్పొరేటర్.. డీజీపీకి సంచలన ఆదేశాలిచ్చిన కేటీఆర్

MIM Corporator: ఈమధ్య హైదరాబాదులో ఎంఐఎం నేతల ఆగడాలను బీజీపీ తరచూ ఎండగడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అండతోనే రెచ్చిపోతున్నారు అంటూ నిత్యం ఆరోపణలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా భోలక్ పూర్ లో పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్, కొందరు వ్యవహరించిన తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు.

MIM Corporator
MIM Corporator, police officers

వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డిజిపికి సూచించారు. భోలక్ పూర్ లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షాపులు తెరిచి ఉండటంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. షాపులు మూసి వేయాలంటూ సూచించారు. కాగా అక్కడికి చేరుకున్న ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్, మరికొందరు కార్యకర్తలు పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రంజాన్ సందర్భంగా షాపులు తెరచుకుంటున్నామని ఇష్టారీతిన మాట్లాడారు.

Also Read: Secret Of KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్ ఇదే.. ఆ నిర‌స‌న‌కు వెళ్ల‌డం డౌటే..?

ఇక నుంచి ప్రతి రోజు తెల్లవారు జాము దాకా షాపులు తెరిచి ఉంటాయని, దుకాణదారులను ఇబ్బంది పెట్టొద్దని.. పోలీసులు తమాషాలు చేస్తున్నారంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం కార్పొరేటర్. ఆయన వ్యాఖ్యలపై కానిస్టేబుల్ స్పందిస్తూ తమ డ్యూటీ తాము చేస్తున్నామని చెప్పడంతో ఆగ్రహించిన గౌసుద్ధిన్.. నువ్వు వంద రూపాయల మనిషివి నాకు చెప్తావా అంటూ మండిపడ్డారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిపోయింది. కాక ఈ వీడియోను కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. పోలీసులపై దురహంకారంగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కేటీఆర్ సమయస్ఫూర్తిగా స్పందించినట్లు అర్థమవుతోంది.

KTR
KTR

ఒకవేళ కేటీఆర్ వీటిపై స్పందించకుంటే.. బిజెపి దీన్ని అడ్వాంటేజ్ గా మలుచుకునేది. ముందస్తుకు సిద్ధమవుతున్న సమయంలో.. బిజెపికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా టీఆర్ఎస్ తనదైన స్టైల్ లో వ్యవహరిస్తోంది.

Also Read:RDO Shoking Comments For Kaaleshwaram: మీరు భూమి ఇవ్వ‌క‌పోతే పురుగుల మందు తాగుతా.. ఇదీ తెలంగాణ‌లో ఉద్యోగుల ప‌రిస్థితి..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version