RRR Movie Box Office Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నైజాం కలెక్షన్స్ చూసి తెలుగు సినీ బాక్సాఫీస్ మాత్రమే కాదు, నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కొనుకున్న నిర్మాత ‘దిల్ రాజ్’ సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అసలు ఈ సినిమా నైజాంలో వంద కోట్ల మార్క్ ను ఎలా దాటింది ? అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు.
తెలుగు సినీ లోకంలో ముఖ్యంగా నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆ స్థాయిలో ఓ ఊపు ఊపేస్తోంది. కలెక్షన్ల విషయంలో సునామీని సృష్టిస్తోంది. ఈ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించాడు జక్కన్న. నిజానికి నైజాం మార్కెట్ చాలా పెద్దది. కానీ.. 10 కోట్ల షేర్ మార్క్ అందుకుంటే చాలా గొప్ప అనే ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు.
Also Read: IMDB : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు ఇవే
కారణం.. నైజాంలో సినిమాలు చూడటం తక్కువ. అయితే.. గత కొన్నేళ్లుగా నైజాంలో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. దాంతో మార్కెట్ కూడా పది రెట్లు పెరిగింది. ప్రతి స్టార్ హీరోకి నైజాంలో తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ ఉంది. అందుకే.. నైజాంలో తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధిస్తున్నాయి. సినిమా రిలీజ్ మొదటి రోజే రూ. 10 కోట్లు వసూలు చేస్తున్నాయి.
కానీ, ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా మొదటి రోజు రూ. 25 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తూ.. నైజాంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ ను నమోదు చేసింది. రోజుల వారీగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ను గమనిస్తే..
మొదటి రోజు : రూ. 23.35 కోట్లు
రెండో రోజు : రూ.15.10 కోట్లు
మూడో రోజు : రూ. 15.05 కోట్లు
నాలుగో రోజు : రూ. 8.15 కోట్లు
ఐదో రోజు : రూ. 6.70 కోట్లు
ఆరో రోజు : రూ. 4.80 కోట్లు
ఏడో రోజు : రూ.4.07 కోట్లు
ఎనిమిదో రోజు : రూ. 4.31 కోట్లు
తొమ్మిదో రోజు : రూ. 8.57 కోట్లు
పదో రోజు : రూ. 6.96 కోట్లు
పదకొండో రోజు : రూ. 2.18 కోట్లు
పన్నెండో రోజు : రూ.2.12 కోట్లు
నైజాంలో మొత్తం పన్నెండు రోజులకు గానూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు : రూ. 101.36 కోట్లు వచ్చాయి. ఇది తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అరుదైన రికార్డు. ఈ రికార్డు సాధించిన రాజమౌళికి ప్రత్యేక అభినందనలు.
Also Read: Samantha Yashoda Movie Release Date: ఆగస్టు 12న ‘యశోద’గా రాబోతున్న సమంత