Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రం నియమించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు ఇది ప్రచారాస్త్రంగా మారనుంది. ఈ క్రమంలో కేసీఆర్‌కు ఆయన పాతబస్తీ దోస్తు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ షాక్ ఇచ్చారు. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పదేళ్లుగా మంచి అడర్‌స్టాండింగ్‌తో ముందుకు సాగుతున్న ఎంఐఎం, బీఆర్‌ఎస్ మైత్రితో ఎన్నికల్లో ఇద్దరూ పరస్పర సహకారం అందించుకుంటున్నారు. ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో కేసీఆర్ బలహీనమైన అభ్యర్థులను పెట్టడం, బీఆర్‌ఎస్ పోటీ చేస్తే స్థానాల్లో అసద్ పోటీ చేయకపోవడం సంప్రదాయంగా వస్తుంది. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ మినహా మిగతా ఆరు స్థానాల్లో ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. అటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాంపల్లి సీటును గెలుస్తూ వస్తున్నారు. మొత్తంగా ఏళ్లుగా ఏడు సీట్లకే ఎంఐఎం పరిమితమవుతోంది.
ఈసారి తొమ్మిది స్థానాల్లో పోటీ..
మొత్తంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దున్ .. తెలంగాణ అసెంబ్లీలో ఏడు సీట్లు ఉన్నాయి. కానీ ఈ సారి ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఏడు సీట్లతోపాటు కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ బరిలో నిలవాలని నిర్ణయించారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని చెబుతున్నాడు. 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ గెలిచింది. ఆ తర్వాత ఆయా అభ్యర్ధులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018లో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అసదుద్దీన్ టిక్కెట్లు ప్రకటించి కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు.
మిత్ర ధర్మం అతిక్రమించి..
తెలంగాణలో రాజకీయంగా మంచి దోస్తులు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ ఆసదుద్దీనే. అదస్ ఆదేశిస్తారు కేసీఆర్ పాటిస్తారు.. కేసీఆర్ చెప్తారు.. అసద్ చేస్తారు అన్నట్లుగా వీరి మైత్రి కొనసాగుతోంది. అయితే ఎంఐఎం చీఫ్ ఇప్పుడు మిత్రధర్మం అతిక్రమించారు. బీఆర్‌ఎస్ అంటే తెలంగాణలో 112 స్థానాలు అని కేసీఆర్ చెబుతారు. కానీ ఇప్పుడు అసద్ దానిని 110 స్థానాలకు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా ఎంఐఎం ఇప్పటి వరకు 50 మించి మైనారిటీలు ఉన్న స్థానాల నుంచే పోటీ చేస్తున్నారు. కానీ, ఈసారి తన పార్టీని విస్తరించే క్రమంలో రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లింలు 20 శాతం ఉంటారు. దీంతో మొదట ఇక్కడ అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయించారు. ఇక్కడ వర్కవుట్ అయితే వచ్చే ఎన్నికల నాటికి 10 శాతం ముస్లింలు ఉన్న నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే రాజేందనగర్, జూబ్లీహిల్స్‌లో ట్రయల్స్ ప్రారంభించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆరుగురు అభ్యర్థుల ప్రకటన..
ఇదిలా ఉండగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ శుక్రవారం ఆరు నియోజకవర్గాలకు టికెట్లు ప్రకటించారు. చంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్‌పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్‌పేట నుంచి అహ్మద్ బలాల, నాంపల్లి నుంచి మాజిద్ హుస్సేన్, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ బరిలోకి దిగుతారని తెలిపారు. పాషాఖాద్రి, ముంతాజ్ ఖాన్‌లు ఈసారి పోటీకి దూరంగా ఉంటారని ప్రకటించారు. బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల అభ్యర్థుల్ని త్వరలోనే తెలిపారు.