Men’s Commission India: ఇది అత్యంత బాధాకరమైన విషయం.. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు అలా ఉన్నాయి కాబట్టి. గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేదు.. ఇలాంటి సంఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్నాయి. ఎలా ఉంటున్నాయి అంటే.. ఒకదాన్ని మించి మరొకటి ఉంటున్నాయి. పైగా భయాన్ని కలగజేస్తున్నాయి. జీవితంలో పెళ్లి అంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేస్తున్నాయి.
పూణేలో కేతన్ అగర్వాల్ ను అతనికి కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ చంపేసిన తర్వాత.. ఆ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఈ కేసు కు సంబంధించిన అనేక సంచలన నిజాలు ఒకదాని వెంట ఒకటి బయటపడుతున్న తర్వాత.. మనదేశంలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ఆ చర్చ ఏకంగా పార్లమెంట్ దాకా వెళ్ళింది. పైగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా జరుగుతున్న పరిణామాలను చూసి భయపడుతున్నారు. ఇది పద్ధతి కాదు.. ఇది విధానం కాదు.. దీనికి పాడాలి చరమగీతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
ఇటీవల కాలంలో మగవాళ్ళను ప్రియురాళ్లు, భార్యలు చంపేస్తున్న నేపథ్యంలో.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే మగవాళ్ళు భయపడిపోతున్నారు. అసలు ఇలా కూడా జరుగుతుందా.. ఇలా ప్రాణాలు తీస్తుంటే ఇక పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలని మగవాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒంటరి జీవితమే బాగుంటుందని.. ఒంటరిగా మిగిలిపోవడమే గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు.
మగవాళ్ళ బాధలు చూడలేక కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులూ స్పందిస్తున్నారు. తాజాగా అశోక్ కుమార్ అనే రాజ్యసభ సభ్యుడు పెద్దల సభలో కీలక వ్యాఖ్యలు చేశాడు. మగవాళ్ళ మీద రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని.. మగవాళ్ళను చంపేస్తున్నారని.. మగవాళ్ళ ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందని.. చెబుతూ.. మగ వాళ్లకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలని.. ఆడవాళ్ళ నుంచి మగవారిని కాపాడాలని ఆయన సాక్షాత్తు పెద్దల సభలో వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మెజారిటీ ప్రజల నుంచి సానుకూల ప్రకటన రావడం గమనార్హం.
image.png
