Homeజాతీయ వార్తలుMegha Vemuri impact on Indian students : మెఘా వేమూరీ వల్ల భారతీయ విద్యార్థులకు...

Megha Vemuri impact on Indian students : మెఘా వేమూరీ వల్ల భారతీయ విద్యార్థులకు అమెరికా చదువులు ఇంకా జఠిలం

Megha Vemuri impact on Indian students : అమెరికా భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్యకు ఒక ప్రధాన గమ్యస్థానంగా ఉంది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అధునాతన పరిశోధన సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు లక్షలాది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2024లో, 3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారని అంచనా. అయితే, ఇటీవలి సంవత్సరాలలో, వీసా నిబంధనలు, రాజకీయ వాతావరణం, మరియు క్యాంపస్‌ వివాదాలు ఈ ప్రయాణాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి.

అమెరికాలో చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న భారతీయ విద్యార్థులకు వీసా పొందడం అతిపెద్ద సవాలుగా మారింది. ట్రంప్‌ పరిపాలనలో అమలైన కఠిన ఇమ్మిగ్రేషన్‌ విధానాలు ఊ–1 విద్యార్థి వీసాల ప్రక్రియను కఠినతరం చేశాయి. మరోవైపు చిన్న నిబంధన ఉల్లంఘనలు, ఉదాహరణకు, ట్రాఫిక్‌ జరిమానాలు లేదా తరగతులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో వీసాలు రద్దు చేయబడుతున్నాయి. 2023లో, దాదాపు 7 వేల మంది భారతీయ విద్యార్థులు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయారని నివేదికలు తెలిపాయి. చదువు పూర్తయిన తర్వాత ఉపాధి కోసం ఏ–1ఆ వీసా పొందడం కూడా కష్టతరమైంది, ఇది భారతీయ విద్యార్థులకు ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.

Also Read : చైనా ఆధిపత్య ఆకాంక్షలు.. అమెరికా వెనక్కి తగ్గుతోందా?

ఓపీటీ రద్దు ప్రతిపాదన..
ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (్ౖకఖీ) పథకం భారతీయ విద్యార్థులకు చదువు తర్వాత అమెరికాలో పని అనుభవం పొందే అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఈ పథకాన్ని రద్దు చేయాలనే ప్రతిపాదనలు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ్ౖకఖీ రద్దు అయితే, విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లవలసి ఉంటుంది, ఇది వారి కెరీర్‌ ఆకాంక్షలను దెబ్బతీస్తుంది. ఈ విధానం ముఖ్యంగా ఖీఉM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌) విద్యార్థులను ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే భారతీయ విద్యార్థులలో ఎక్కువ మంది ఈ రంగాల్లో చదువుతున్నారు.

క్యాంపస్‌ రాజకీయాలు, వివాదాలు
అమెరికా విశ్వవిద్యాలయాలలో రాజకీయ ఆందోళనలు, వివాదాలు భారతీయ విద్యార్థులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు, పాలస్తీనా–ఇజ్రాయెల్‌ సంఘర్షణ సంబంధిత ఆందోళనలలో పాల్గొన్న విద్యార్థులు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటున్నారు.
ఇటీవలి కొన్ని సంఘటనలలో, ఆందోళనలలో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలపై చర్యలు తీసుకోవడం లేదా విశ్వవిద్యాలయ అడ్మిషన్లపై ఆంక్షలు విధించడం జరిగింది.
ఈ విధమైన సంఘటనలు విద్యార్థులను క్యాంపస్‌ కార్యకలాపాలలో పాల్గొనడానికి భయపడేలా చేస్తున్నాయి, ఇది వారి విద్యా అనుభవాన్ని పరిమితం చేస్తుంది.

ఆర్థిక ఒత్తిడి, సామాజిక సవాళ్లు
అమెరికాలో చదువు ఖర్చు ఎక్కువగా ఉండటంతో, భారతీయ విద్యార్థులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక సంవత్సరం ట్యూషన్‌ ఫీజు, జీవన ఖర్చులు సగటున 50 వేల డాలర్ల నుంచి 70 వేల డాలర్ల వరకు ఉంటుంది. ఇది చాలా మంది భారతీయ కుటుంబాలకు భారమైనది.

తాజాగా మెఘా వేమూరి వివాదం..
తాజాగా ఎంఐటీ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి మెఘా వేమూరి గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతీయ విద్యార్థుల అమెరికా చదువులను మరింత జఠిలం చేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికా పౌరసత్వం ఉన్న మెఠా మేమూరి గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడారు. ఇజ్రాయెల్‌ పాలస్తీనాను కనుమరుగు చేయాలని చూస్తోందని విమర్శించారు. ఎంఐటీ యూడా ఈ హింసలో భాగస్వామి అని పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు మాత్రం వర్సిటీ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో చదువులోకవాలనుకుంటున్న, చదువుకుంటున్న, అమెరికా వెళ్లాలనుకుంటున్నవారి అవకాశాలకు ఆటంకంగా మారాయి.

ఎన్నో అంశాలు ఉన్నా..
మెఘా వేమూరి మాట్లాడడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే అమె అండర్‌ గ్రాడ్యుయేట్‌. అంటే టీనేజీ అమ్మాయే. అయినా అంత మెచ్యూరిటీగా ఆలోచించడం అభినందనించాల్సిన అంశం. చాలా మంది మెఘాను అభినందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎంఐటీ యాజమాన్యం మాత్రం ఆమె గ్రాడ్యుయేషన్‌ సెర్మనీకి రాకుండా నిషేధించింది. ఇక మెఘా వేమూరికి మాట్లాడడానికి ఉక్రెయిన్‌ – రష్యా, పహల్గాంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఆమె తనకు గుర్తింపు తెచ్చే అంశాన్ని మాత్రమే ఎంచుకుంది. సాధారణంగా గ్రాడ్యుయేషన్‌ సెర్మనీలో అందరూ ప్రశంసనీయమైన ప్రసంగం చేస్తారు. మెఘా మాత్రం వివాదాస్పద అంశం ఎంచుకుని తాను గుర్తింపు తెచ్చుకుంది. కానీ, భారతీయుల అమెరికా చదువుల కలకు ఆటంకాలు సృష్టించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular