Mahesh Babu Rajamouli Movie Business: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు… మహేష్ బాబు లాంటి నటుడు సైతం కెరియర్ మొదటి నుంచి కూడా ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ ఆయనకు మాస్ సినిమాలతోనే మంచి ఇమేజ్ రావడంతో ఒకానొక సందర్భంలో వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు…
Also Read: డ్రాగన్ సినిమాలో కనిపించనున్న సీనియర్ నటి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) సైతం వరుస సినిమాలను చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరింప చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో రాజమౌళి (Rajamouli) ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా రాజమౌళి బయటికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నాడు. దీనివల్ల 1000 కోట్ల కలెక్షన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే 1500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టే విధంగా ప్రణాళికల రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇంతకుముందు ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా మేకింగ్ వీడియో ని నెట్ ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మిన రాజమౌళి ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ వీడియోలను సైతం నెట్ ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మి ఎక్కువ డబ్బులు అర్జించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా మేకింగ్ వీడియో ని కూడా వాళ్లకే అమ్మేసి దాని మీద కూడా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
దానికోసమే సినిమాకు సంబంధించిన ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ని ఆయన బయటికి చెప్పడం లేదు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరగబోతోంది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ కి ముందే 1500 కోట్ల వరకు డబ్బులు అయితే సంపాదించి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్స్ అన్ని లాభాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనను మించిన వారు మరెవరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…