మన బ్యాంకుల దొంగ ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. సముద్రంలోని ఓ ద్వీప దేశంలో బీచ్ ఒడ్డున పిచ్చివాడిలా కాగితాలు విసిరేసిన అతడిని డొమినికా పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి కరేమియన్ దేశం అంటిగ్వాకు పారిపోయాడు ముకుల్ ఛోక్సీ. ఆ దేశ పౌరసత్వం తీసుకొని అక్కడేతిష్ట వేశాడు. భారత్ అప్పగించాలని అంటిగ్వాను కోరినా ఆ దేశం నో చెప్పింది.
అయితే అప్పటి నుంచి అంటిగ్వాలో తలదాచుకుంటున్న ఈ బ్యాంకు దొంగ చోక్సీ గత ఆదివారం ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ దేశ పోలీసులు ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. చుట్టూ సముద్రం లో ఉన్న అంటిగ్వా దేశం నుంచి అతడు బోటులో పారిపోయాడని అనుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే అంటిగ్వాకు పక్కనే సముద్రంలో ఉన్న చిన్న దేశం డొమినికాలోని ఓ బీచ్ లో ఏవో పత్రాలు సముద్రంలోకి విసిరేస్తూ చోక్సీ పోలీసులకు చిక్కాడు.
2018 ఆరంభంలో పంజాబ్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి భారత్ నుంచి పారిపోయాడు చోక్సీ. అంటిగ్వాలో పౌరసత్వం తీసుకొని అక్కడే ఉంటున్నాడు. అంటిగ్వాలో తాజాగా కనిపించకుండా పోయాడు. సాయంత్రం డిన్నర్ కని బయటకు వచ్చిన అతడు అదృశ్యమయ్యాడు.
మంగళవారం సాయంత్రం అంటిగ్వా పక్కనే ఉన్న మరో కరేబియన్ దీవి డొమినికాలో గుర్తించారు. ఆ దేశ బీచ్ లో ఏవో పత్రాలను సముద్రంలోకి విసిరేస్తూ పోలీసులకు చిక్కాడు. డొమినికాకు ఎయిర్ పోర్టు లేదు. పడవల్లోనే ఆ దేశం రావాలి. డొమినికా నుంచి క్యూబా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టు అక్కడి పోలీసుల విచారణలో తేలింది.
డొమినికా నుంచి చోక్సీ ని భారత్ కు పంపేయాలని అంటిగ్వా ప్రధాని కోరాడు. డొమినికాలో చోక్సీ పౌరసత్వం లేదు. దీంతో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో అతడిని భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.