భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

కరోనా ఎఫెక్ట్ తో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుముఖంపట్టాయి. దీంతో ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో గ్యాస్ ధరలు తగ్గడం వినియోగదారులకు ఒకరకంగా శుభవార్తే అని చెప్పొచ్చు. ఆయిల్ కంపెనీలు నెలవారీగా సమీక్షలో భాగంగా తగ్గిన గ్యాస్ ధరలను ప్రకటించాయి. నేటి నుంచి 15రోజులపాటు తగ్గిన గ్యాస్ ధరలు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. రేపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్న మోదీ ఈమేరకు హైదరాబాద్ నగరంలో 14.2కిలోల […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 5:01 pm
Follow us on


కరోనా ఎఫెక్ట్ తో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుముఖంపట్టాయి. దీంతో ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో గ్యాస్ ధరలు తగ్గడం వినియోగదారులకు ఒకరకంగా శుభవార్తే అని చెప్పొచ్చు. ఆయిల్ కంపెనీలు నెలవారీగా సమీక్షలో భాగంగా తగ్గిన గ్యాస్ ధరలను ప్రకటించాయి. నేటి నుంచి 15రోజులపాటు తగ్గిన గ్యాస్ ధరలు అమల్లో ఉంటాయని ప్రకటించాయి.

రేపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్న మోదీ

ఈమేరకు హైదరాబాద్ నగరంలో 14.2కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.207కు తగ్గింది. దీంతో గ్యాస్ ధర రూ.589.50నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.336 తగ్గి రూ.988నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలో ఎలీపీజీ సిలిండర్ ధర రూ.744నుంచి రూ.581.50కు తగ్గింది. ముంబై నగరంలో రూ.714.50 నుంచి రూ.579కు పడిపోయింది. కోల్‌కతాలో రూ.190 తగ్గి రూ.584.50కు, చెన్నై నగరంలో రూ.569.50కు ధరలకు పడిపోయింది.

ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19కేజీలు)ధర రూ.336 క్షీణించింది. ఢిల్లీలో రూ. 744 నుంచి రూ.611కు తగ్గింది. కోల్‌క‌తాలో రూ. 839 నుంచి రూ. 774కు, ముంబైలో సిలిండ‌ర్ ధ‌ర రూ. 579కి త‌గ్గింది. హైద‌రాబాద్లో రూ. 862 నుంచి రూ. 796కు త‌గ్గింది. ఈ ధరలన్నీ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.