https://oktelugu.com/

కేటీఆర్ పిలుపుకు స్పందించిన కవిత

నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల శుక్రవారం హైదరబాద్లోని తన నివాసంలో రక్తదానం చేశారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు వారంరోజులపాటు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుకు స్పందించిన ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత శుక్రవారం రక్తం చేశారు. సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక! ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత రక్తదానం చేసి ఆపదలో […]

Written By: , Updated On : May 1, 2020 / 06:16 PM IST
Follow us on


నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల శుక్రవారం హైదరబాద్లోని తన నివాసంలో రక్తదానం చేశారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు వారంరోజులపాటు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుకు స్పందించిన ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత శుక్రవారం రక్తం చేశారు.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. తలసేమియా, అత్యవసరంగా చికిత్స అందేవారికి సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు ఆమె తెలిపారు. సమాజ సేవలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముందుండాలన్నారు. లాక్డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకుల్లో రక్తంనిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ఈమేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువుగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రక్తదాన సమయంలో ఆమె మాస్క్‌లు ధరించి ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నారు.