Manmohan Singh Passed Away: ఈ సువిశాల భారతదేశంలో యాక్సిడెంటల్ ప్రధాన మంత్రులు చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో మొదటగా గుర్తుకు వచ్చే పేరు చరణ్ సింగ్.. రెండవ పేరు చంద్రశేఖర్.. మూడో పేరు పీవీ నరసింహారావు.. నాలుగో పేరు దేవే గౌడ.. ఐదో పేరు ఐకే గుజ్రాల్. కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ పని చేశారు. ఆయన రాజీనామా అనంతరం బలం లేకపోయినప్పటికీ 1979 జూలై నెలలో చరణ్ సింగ్ యాదృచ్ఛికంగా ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన ఒక్కసారి కూడా పార్లమెంటు సమావేశాలు నిర్వహించలేకపోయారు. కానీ ఆరు నెలల కాలంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 1989లో జనతాదళ్ తరఫున పి.పి సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఏడాది కూడా పదవి కాలం పూర్తి చేసుకోకుండానే రాజీనామా చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ప్రధానమంత్రి అయ్యారు. 223 రోజులపాటు ప్రధాన మంత్రిగా కొనసాగారు. 1991లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 232 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. తద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించి. నాడు ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ప్రధానమంత్రిగా పనిచేయాలని శంకర్ దయాల్ శర్మకు అవకాశం వచ్చినప్పటికీ.. తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆ పదవిని శంకర్ దయాల్ శర్మ చేపట్టలేదు. దీంతో అనూహ్యంగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఇక ఆయన తర్వాత దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ఎలా ప్రధాన మంత్రులయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ పదం సరికాదు
యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటే.. 10 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న వ్యక్తి కాదు. ఒకళ్ళకు అవకాశం లేదు అనుకుంటే ఆ పదవి దక్కిన వాళ్లు . ఒక పార్టీ మద్దతు ఒక ఏడాది లేదా రెండు సంవత్సరాలు ప్రధాన మంత్రి పదవిని కొనసాగించిన వాళ్లు.. ఈ లెక్కన చూసుకుంటే మన్మోహన్ సింగ్ యాక్సిడెంట ల్ ప్రైమ్ మినిస్టర్ కానే కాదు. మన్మోహన్ సింగ్ విద్యావేత్త. ఆర్థిక రంగంపై విపరీతమైన పట్టు ఉంది. ఆయనకు కుటిల రాజకీయాలు తెలియవు. ఎత్తులు తెలియ. చిత్తులు అంతకన్నా తెలియవు. ఏకబిగిన 33 సంవత్సరాల పాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు రాజకీయ చాణక్యం తెలియదు. ఎత్తుగడల మీద పట్టలేదు. అందువల్లే 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతిన్నది. రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రణబ్ ముఖర్జీ అడ్డుపడటం .. సోనియా గాంధీ స్పీడ్ బ్రేకర్లు వేయడం వంటివి మన్మోహన్ సింగ్ ను ప్రభావితం చేశాయి అంటారు .. 2012లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి చేయాలని.. మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిని చేయాలని సోనియా అనుకున్నారట. కానీ దానిని అమల్లో పెట్టలేకపోయారు. అది గనుక జరిగి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేదని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికి చెబుతుంటారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత.. ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం.. స్థూలంగా ఒకటి మాత్రం నిజం.. మన్మోహన్ సింగ్ వల్లే ఈ దేశం ఆర్థికంగా నిలబడగలిగింది. నేడు ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఏనాడూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. గాంధీల కుటుంబం స్తోత్రంలో మన్మోహన్, పివిలాంటి వాళ్లు స్మరణకు నోచుకోలేరు. నోచుకునే అవకాశం కూడా లేదు.