Fake Campaigns: శారీ బ్రిగేడ్… ఈ పేరు చాలా మందికి తెలియదు.. కానీ ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఈ బ్రిగేడ్ ట్రెండింగ్‌లో ఉంది. వీరు భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను, చీరలను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తారు. ప్రధానంగా పండుగలకు మహిళలకు శుభాకాంక్షలు తెలపడం, చీరల అందాన్ని హైలెట్ చేయడం చేస్తుంటారు. అయితే, వీరు ఇతర సమయాల్లో భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. మన నేతలను విమర్శిస్తున్నారు. మన దేశంలోని సమస్యలను ప్రస్తావిస్తూ.. మన మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
నకిలీ ఈడెంటిటీల వాడకం..
ఈ శారీ బ్రిగేడ్‌లు.. చాలా వరకు నకిలీ ట్విట్టర్(ఎక్స్) ఖాతాలు వాడుతున్నారు. ఈ అకౌంట్ల ద్వారానే మన దేశంపై వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నారు. యువతను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఎక్స్ అందుబాటులోకి తెచ్చిన కొత్త ఫీచర్ “About This Account’ తో శారీ బ్రిగేడ్ సభ్యుల అసలు స్వరూపం బయటపడింది. ఇంతకాలం వారి పేర్లు భారతీయాలేవని భావించినప్పటికీ, అసలు ముస్లింల పేర్లు, పాకిస్తానీ ఆలోచనలతో నడుపబడుతున్న అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరు భారతీయులుగా నటిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తున్నారు.
వివక్ష పెంచేలా పోస్టులు..
ఇవే అకౌంట్లు భారతీయుల మధ్య కులవిభేదాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్రాహ్మణులకు, దళితులకు అన్యాయం జరుగుతున్నట్లు తప్పుదారితీసే వ్యాఖ్యలు, దేశీయ సమస్యలపై మౌలిక విషయాలను ప్రస్తావించడం, ఈ అకౌంట్ల లక్షణం. నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తున్నారు.
కశ్మీర్ అంశం, రైతు ఉద్యమాలపై తప్పుడు ప్రచారం..
కశ్మీర్ పోలీసులపై ఆవేదనలు వ్యక్తం చేసిన యువతులు, పంజాబ్ రైతుల సమస్యల గురించి ట్విట్టర్‌లో పోస్ట్లు పెడతారు. కానీ “About This Account’ ఫీచర్ పరిశీలనలో వీరు వేరే దేశాలకు చెందినవాళ్లని కనుగొనడం, కొంతమంది ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో నడిపే ఆపరేషన్లు అని తెలుస్తోంది. కొందరు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా దేశంపై విషప్రచారం చేస్తున్నారు.
సైనికులను ట్రాప్ చేసేయత్నం..
ఇలాంటి వాటి కారణంగా భారత ప్రభుత్వం సైనికులు సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని, కొన్ని ప్లాట్‌ఫారాల వాడకాన్ని నివారించాలని సూచించింది. దేశ రక్షణకు హానికరంగా ఉండే ఆన్‌లైన్ వ్యూహాలపై తీవ్ర శ్రద్ధ అవసరం అని చూస్తోంది.
భారతీయుడిలా మారి చిండాలుగా వ్యవహరించే ఈ గ్రూపులు దేశ భద్రతను దెబ్బతీయడమే కాదు, ప్రజల్లో అనవసర విభేదాలు, ద్వేషాలు పెంచుతుంటాయి. అర్థభరిత సందేశాలతో స్పందించి, వాస్తవాలను వెలికితీయడం సమాజ బాధ్యతగా భావించాలి. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం 1.90 లక్షల నకిలీ, విద్వేషాలను రెచ్చగొట్టే అకౌంట్లు సీజ్ చేసింది. అయినా మళ్లీ ఇలాంటివాళ్లు పుట్టుకొస్తున్నారు. ట్విట్టర్ ఆప్షన్‌తో మళ్లీ రహస్యాలు బయటపడుతున్నాయి.