Venkatesh and Anil Ravipudi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో భారీ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకున్న హీరోలు చాలామంది ఉన్నారు మరి అలాంటి వారిలో వెంకటేష్ ఒకరు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఫ్యామిలీ హీరోగా అతనికి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను అనిల్ రావిపూడి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఈ సినిమా నుంచి మూడో సాంగ్ కూడా రాబోతుంది అంటూ వెంకటేష్ అనిల్ రావిపూడి కలిసి ఒక ప్రమోషనల్ వీడియో అయితే చేశారు. నిజానికి ఇంతకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి డైరెక్టర్ అనిల్ రావిపూడి మూడో సాంగ్ ని బాలీవుడ్ నుంచి గాని, మలయాళం నుంచి గాని ఒక సింగర్ ను తీసుకొచ్చి భారీ ఎఫర్ట్స్ పెట్టి పాడిద్దాము అని ఇతరులతో ప్లాన్ చేస్తున్న ప్రతిసారి వెంకటేష్ వచ్చి నేను పడుతా అంటూ చెబుతూ ఉండడంతో అనిల్ రావిపూడి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తు ఉంటాడు. ఇక ఆయన పడుకున్నా కూడా వెంకటేష్ వెళ్లి అనిల్ ను లేపి మరి నేను మూడో పాట పాడుతాను అని చెబుతున్నాడు దాంతో విసిగిపోయిన అనిల్ భీమ్స్ కి ఫోన్ చేసి వెంకటేష్ తో పాత పడించమని చెప్పాడు.
ఇక ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. నిజానికి ఈ సాంగ్ మీద హైప్ తెప్పించడానికి ఇలాంటి ఒక ఫన్నీ వీడియోను అయితే క్రియేట్ చేశారు. మరి అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ మధ్య ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే విషయం మనకు తెలిసిందే. ఇంతకు ముందు కూడా సినిమా టైటిల్ విషయంలో ఆయన ప్రమోషన్ వీడియోని చేశాడు.
ఆ వీడియో చాలా వరకు క్లిక్ అయింది. దాంతో ఇప్పుడు వెంకటేష్ తో కలిసి ఈ వీడియో చేశాడు. అయితే ఈ వీడియో మొత్తం లో వెంకటేష్ నేను పాడుతా అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అయితే కబడ్డీ కబడ్డీ సినిమాలో యాక్టర్ చిన్న కబడ్డీ ఆడుతున్న సందర్భంలో వచ్చి నేను ఆడుతా అని అంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ కూడా ఆ టోన్ లోనే చెప్పడం అనేది వీడియోలో హైలెట్ అయిందనే చెప్పాలి…
మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి ఈ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఆయన ట్రాక్ రికార్డు అనేది మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
