రాజకీయాలు పక్కన పెట్టి మొత్తం దేశ ప్రజలు ఒకటిగా కరొనపై పోరాటం చేయవలసిన ప్రస్తుత తరుణంలో సహితం పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ జగదీప్ ధంకర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉంది. రాజకీయ విమర్శలకు దిగుతున్నారు.
తాజాగా గవర్నర్ రాష్ట్ర సర్కార్ కరోనా కేసుల సంఖ్యను తొక్కిపెడుతున్నదని ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. వెంటనే అసలు వివరాలను ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. కరోనా కేసులకు సంబంధించిన కొన్ని రిపోర్టులను తన పోస్టుకు జతచేశారు.
మోదీకి లాక్ డౌన్ విషయంలో దిక్కు తోచడం లేదా!
ఏప్రిల్ 30 వరకు రాష్రంలోని కరోనా కేసుల సంఖ్య 572గా ఉందని, అయితే తరువాత నమోదైన కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా కరోనా కేసులను దాచిపెట్టడం ముఖ్యమంత్రి మానుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 931 కరోనా కేసులు నమోదైనట్లు తన దృష్టికి వచ్చిందని, అయితే మమత ప్రభుత్వం మాత్రం 572 కేసులుగానే ప్రపంచానికి చెబుతోందని ఆరోపించారు. 572కు 931కి చాలా తేడా ఉందని, కరోనా బారిన పడి మరణించిన వారి వివరాలను, లేదా కోలుకున్న వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
ట్రాఫిక్ ఫ్రీ నగరంగా రాజధాని.. మాస్టర్ ప్లాన్!
మందులేని మహమ్మారితో పోరాడుతూ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రం నుంచి కరోనాను పారద్రోలాల్సింది పోయి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తున్నారని గవర్నర్ ధంకర్ ఆరోపించారు.
దీనిపై పాలక తృణమూల్ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. రాజ్‌భవన్ బీజేపీ పార్టీ ఆఫీసుగా మారిందని మండిపడింది. బుద్ధిపూర్వకంగా గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని విమంర్శించే హక్కు లేదని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ధ్వజమెత్తారు.
జనాదరణ కలిగిన మమత మీద ఈర్ష్యతో ఆమెను విమర్శించే ఏకసూత్ర ఎజెండాతో గవర్నర్ పనిచేస్తున్నారని మండిపడ్డాయిరు. కావాలంటే ఆయన బెంగాల్లో పోటీచేయాలని బెనర్జీ సవాల్ చేశారు.
కొవిడ్-19 సంక్షోభం సమయంలో కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ తమ అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో అధికారిక సంభాషణలు, లోగోలు వినియోగించడం ఆపేయాలంటూ హితవు పలికారు.
సీఎం మమతకు గత వారంలో గవర్నర్ రెండు లేఖలు రాసిన నేపథ్యంలోనే ఆమె ఈ మేరకు స్పందించడం గమనార్హం.
‘‘ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ ముఖ్యమంత్రి పట్ల గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం, అలాంటి మాటలు, స్వరం ఉపయోగించడం భారత రాజ్యాంగ, రాజకీయ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చోటుచేసుకోలేదు” అంటూ ఆమె ధ్వజమెత్తారు.
“నన్ను, నా మంత్రులను, అధికారులను ఉద్దేశించి మీరు చేసిన ఈ వ్యాఖ్యలు దూషించడం, మితిమీరడం, బెదిరించడం, అధికార దుర్వినియోగం చేయడం కిందికి వస్తాయి…’’ అంటూ మమత 14 పేజీలతో కూడిన సమాధానాన్ని గవర్నర్‌కు పంపారు. రాజ్యాంగ నియమాలను ఏమాత్రం ‘‘పాటించకుండా’’… వాటిని ‘‘ఉల్లంఘిస్తూ’’.. తిరిగి తమకే గవర్నర్ పాఠాలు చెబుతున్నారని మమత దుయ్యబట్టారు.