https://oktelugu.com/

జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి?

జగన్ గద్దెనెక్కగానే.. ఆయనకు సపోర్టుగా సాక్షిలో పెద్ద కొలువులు చేసిన వారు.. జగన్ కోసం కష్టపడ్డ సీనియర్ విలేకరులకు పదవులు వచ్చేశాయి. సాక్షి లో కీలక పదవిలో ఉన్న సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి కూడా జగన్ సలహాదారుగా చేరిపోయాడు. అయితే తాజాగా ఆయన తన సలహాదారు పదవికి రాజీనామా చేసినట్టు వార్తలొచ్చాయి. ఇది తీవ్ర చర్చనీయంశమైంది. జగన్ సలహాదారు ఎందుకు రాజీనామా చేశారన్న ప్రచారం మొదలైంది. ఏంటా కారణం తెలుసుకుందాం. ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా రాజధాని.. మాస్టర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 3, 2020 1:10 pm
    Follow us on


    జగన్ గద్దెనెక్కగానే.. ఆయనకు సపోర్టుగా సాక్షిలో పెద్ద కొలువులు చేసిన వారు.. జగన్ కోసం కష్టపడ్డ సీనియర్ విలేకరులకు పదవులు వచ్చేశాయి. సాక్షి లో కీలక పదవిలో ఉన్న సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి కూడా జగన్ సలహాదారుగా చేరిపోయాడు. అయితే తాజాగా ఆయన తన సలహాదారు పదవికి రాజీనామా చేసినట్టు వార్తలొచ్చాయి. ఇది తీవ్ర చర్చనీయంశమైంది. జగన్ సలహాదారు ఎందుకు రాజీనామా చేశారన్న ప్రచారం మొదలైంది. ఏంటా కారణం తెలుసుకుందాం.

    ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా రాజధాని.. మాస్టర్ ప్లాన్!

    *సీనియర్ జర్నలిస్టు ప్రస్థానమిదీ..
    నిజానికి ఈయన మొదట ఆంధ్రజ్యోతి జర్నలిస్టు.. ఆ తర్వాత హెచ్ఎంటీవీ స్థాపించి అటు ఇటు తిరిగి సాక్షిలో కీలక పదవిని అధిరోహించాడు. జగన్ గద్దెనెక్కడంలో మీడియా పాత్రలో బాగా రాణించారు. ఇక ఫ్రీడమ్ జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే ఈయన ఆంధ్రజ్యోతిని వీడాక ఆ స్థాయిలో రాణించలేకపోయారనే ప్రచారం ఉంది. యాజమాన్యం కండీషన్లు, నిబంధనల ప్రకారం నడుచుకుపోయారంటారు. ఇక పొగ గిట్టని వైసీపీ లాబీయింగ్ కూడా సాక్షి నుంచి జగన్ సలహాదారు పోస్టులోకి బదిలీ అయ్యారు.అక్కడి నుంచి ఆయనకు పనిలేకుండా పోయిందట.. ఇన్నాళ్లు పనిచేసి జీతం తీసుకున్న ఆయన ఇప్పుడు జగన్ కు సలహాలిచ్చే అవకాశం లేక.. చెప్పినా ఆయనకు వినే టైం లేక.. అస్సలు పనే లేకపోయేసరికి ఇప్పుడు మూడు నెలలుగా జీతాలు తీసుకోవడం లేదట.. ఆయన రాజీనామా చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.

    మోదీకి లాక్ డౌన్ విషయంలో దిక్కు తోచడం లేదా!

    *జగన్ ప్రభుత్వంలో అంతే..
    సీఎం జగన్ సీఎంగా గద్దెనెక్కాక సంక్షేమ పథకాలు.. నవరత్నాలు.. అధికారులతో పనులు చేయించుకోవడాలు.. ఢిల్లీ లాబీయింగ్, రాజధాని పనులు, చంద్రబాబు ఎత్తులు పైఎత్తులు.. మీడియా చిత్తులు ఇలా ఇవన్నీ చక్కదిద్దడానికే సమయం పోయింది. ఇక ఈ బిజీలో ఆయన మంత్రులకే టైం ఇవ్వడం లేదు.. ఇక సలహాదారుల పరిస్థితి చెప్పక్కర్లేదు. అసలు పనిలేని ఉత్సవ విగ్రహాలుగా సలహాదారులందరూ మిగిలిపోయారట..

    *సలహాదారులు ఉత్సవ విగ్రహాలే..
    జగన్ ప్రభుత్వంలో ఇప్పటికే వివిధ రంగాల్లో బోలెడంత మంది సలహాదారులున్నారు. ఏదో వారు వైసీపీ కోసం పాటుపడ్డారని వారందరినీ జగన్ ప్రభుత్వ సలహాదారు పోస్టుల్లో సర్దుబాటు చేశారు. అంతేతప్ప వాళ్లు ఏదో చెబుతారు.. తాను వినాలని.. వారి సలహాల ప్రకారం పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలని కాదు.. తన ఆలోచనల ప్రకారం జగన్ నడుస్తాడు.. తన కేంద్రంగా జగన్ పాలన ఉంటుంది. ఒక్కడే పాదయాత్ర చేసి పార్టీని కాపాడుకొని అధికారంలోకి తీసుకొచ్చాడు. సో జగన్ వన్ మ్యాన్ ఆర్మీ. ఇందులో ఒకరిద్దరు తప్పితే మిగతా మంత్రులతోపాటు సలహాదారులు ఉత్సవ విగ్రహాలేనట..

    *జగన్ సలహాలు తీసుకుంటాడు కానీ..
    అయితే జగన్ సలహాలు తీసుకోడని కాదు.. ఆయన కేసీఆర్, విజయసాయిరెడ్డి, సీఎంవోలోని సీనియర్ ఐఏఎస్ లు, మాజీ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి సహా తనను అధికారంలోకి తీసుకొచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలను తీసుకుంటాడు.. కానీ అందరివీ తీసుకోడు.. దగ్గరకు రానీయడు కూడా.. అంత టైం కూడా జగన్ కు లేదు.

    *సీనియర్ జర్నలిస్టు అందుకే అలిగాడా..
    సీనియర్ జర్నలిస్టు రాంచంద్రమూర్తి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షి వరకు జర్నలిస్టు సర్కిల్స్ లో ఎంతో సీనియర్. విలువైన వ్యక్తి. ఆయన ప్రస్తుతం జగన్ కొలువులో సలహాదారు పోస్టులో ఉన్నారు. కానీ జగన్ కు సలహాలు ఇవ్వలేకపోవడం.. ఇచ్చినా ఆయనకు దగ్గరకు పోలేకపోవడం.. ఉత్సవ విగ్రహం లాంటి కుర్చీలో కూర్చోలేక.. ఊరికే జీతం తీసుకోలేక ఇక మూడు నెలలుగా జీతం కూడా తీసుకోలేదట.. తాజాగా ఆయన రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి గాసిప్పులేనని తేలింది. జగన్ ఇచ్చిన పదవిని వదులుకోలేక.. ఆయనకు చెడ్డపేరు తీసుకురాలేక ప్రస్తుతానికి అలా ఆయన పదవిలో ఉన్నాడంతే..