Homeజాతీయ వార్తలుBlack Panther at Bhadra Tiger Reserve: ఒళ్లంతా నలుపు.. కళ్ళేమో చురుకు.. వామ్మో ఏం...

Black Panther at Bhadra Tiger Reserve: ఒళ్లంతా నలుపు.. కళ్ళేమో చురుకు.. వామ్మో ఏం పులి ఇది.. మనదేశంలో ఎక్కడుంది అంటే

Black Panther at Bhadra Tiger Reserve: మన దేశంలో అభయారణ్యాలు చాలానే ఉన్నాయి. అందులో పులులు కూడా విస్తారంగానే ఉంటాయి. బెంగాల్ ప్రాంతంలో బెంగాల్ పులులు.. తెలుగు రాష్ట్రాలలో పులులు.. మధ్యప్రదేశ్లో చిరుతలు.. ఇలా అనేక రకాల పులిజాతులు మనదేశంలో ఉన్నాయి.

మనం సినిమాలలో లేదా డిస్కవరీ చానల్స్ లో నల్ల పులిని చూసి ఉంటాం. ఆ పులి చూసేందుకు భిన్నంగా ఉంటుంది. దాని దేహం పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. నేత్రాలు మెరుస్తూ ఉంటాయి. అయితే అటువంటి పులి మనదేశంలో ఉంది. అది కూడా దక్షిణ భారతదేశంలోని కర్ణాటక ప్రాంతంలో ఉంది.

కర్ణాటక రాష్ట్రంలోని భద్ర టైగర్ రిజర్వులో ఇటీవల నల్ల పులి కనిపించింది. ఆ పులి సీసీ కెమెరాలలో రికార్డయింది. భద్ర టైగర్ రిజర్వులో ఓ నీటి కొలను వద్దకు ఆ పులి వచ్చింది. మరో సాధారణమైన పులితో కలిసి నీటిని తాగింది. అడవుల్లో మామూలు పులులు విస్తారంగానే ఉంటాయి. కానీ నల్ల పులి మాత్రం కనిపించడం మన దేశంలో ఇదే తొలిసారి.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో ముందుగా ఒక సాధారణమైన పులి వచ్చి నీటి కొలను వద్ద నీటిని తాగింది. ఆ తర్వాత ఒక నల్ల పులి నెమ్మదిగా వచ్చి.. అదే కొలనులో నీటిని తాగింది. సాధారణంగా పులులు పరస్పరం దూరంగా ఉంటాయి. లైంగిక కలయిక సమయంలో తప్ప.. మిగతా సందర్భాలలో కాస్త ఎడాన్ని పాటిస్తూ ఉంటాయి. కానీ ఈ నల్ల పులి మాత్రం సాధారణ పులికి వెనుక వైపుగా వచ్చింది. దాని వెంటనే ఉంటూ నీరు తాగి వెళ్ళింది.

ఈ వీడియోను సోహన్ సింగ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది అద్భుతమైన వీడియో అని అతని పేర్కొన్నాడు. భద్ర టైగర్ రిజర్వులో చోటు చేసుకున్న ఈ సన్నివేశం చాలా మందికి నచ్చుతుందని అతడు పేర్కొన్నాడు. అయితే పులుల్లో జన్యుల మార్పు వల్ల ఇలాంటి నల్ల పులులు పుడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version