Homeఆధ్యాత్మికంToday 21 February 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారిపై శని ప్రభావం.. అదృష్టం...

Today 21 February 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారిపై శని ప్రభావం.. అదృష్టం తలుపు తట్టే అవకాశం..

Today 21 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశులపై శని దేవుడి ప్రభావం ఉంటుంది. దీంతో వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మరికొందరు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో లాభాల పంట పండుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. కొందరు పనులను చెడగొట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరిధిలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొందరు వ్యక్తులు మీ పనులకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించవద్దు. విద్యార్థులకు అసాధారణ విజయాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితోనూ అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ విషయంలో బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల ఆదాయం అనుకోకుండా పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులు శత్రులపై విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఎవరితోనూ అవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆశించిన విజయాలు దక్కుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పెద్దల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడిలో నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. బంధువుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో రాణిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇతరుల సహకారం ఉంటుంది. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యుల తో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేయడంతో సంతృప్తిగా ఉంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. వీటిని పరిష్కరించుకోవడానికి పెద్దలను సంప్రదిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో కలిసి వస్తుంది. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ప్రయాణం చేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version