https://oktelugu.com/

మోదీకి లాక్ డౌన్ విషయంలో దిక్కు తోచడం లేదా!

దేశ వ్యాప్తంగా మూడు వారాల లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా కరోనా వైరస్ భారత దేశంలో వ్యాపించకుండా కట్టడి చేయడంలో చాలావరకు విజయం సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ తర్వాత ముందుకు వెళ్లే విషయంలో దిక్కుతోచక ఇబ్బందికి గురవుతున్నారా? ఏప్రిల్ 14 నుండి లాక్ డౌన్ ను సడలించడం ద్వారా దేశంలో ఆర్ధిక కార్యకలాపాల పునరుద్దరణకు అవకాశం ఇవ్వాలని భావించిన ఆయన ముఖ్యమంత్రుల వత్తిడి కారణంగా మరో మూడు వారాలపాటు పొడిగించక తప్పలేదు. కేంద్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 2, 2020 / 08:07 PM IST
    Follow us on


    దేశ వ్యాప్తంగా మూడు వారాల లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా కరోనా వైరస్ భారత దేశంలో వ్యాపించకుండా కట్టడి చేయడంలో చాలావరకు విజయం సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ తర్వాత ముందుకు వెళ్లే విషయంలో దిక్కుతోచక ఇబ్బందికి గురవుతున్నారా?

    ఏప్రిల్ 14 నుండి లాక్ డౌన్ ను సడలించడం ద్వారా దేశంలో ఆర్ధిక కార్యకలాపాల పునరుద్దరణకు అవకాశం ఇవ్వాలని భావించిన ఆయన ముఖ్యమంత్రుల వత్తిడి కారణంగా మరో మూడు వారాలపాటు పొడిగించక తప్పలేదు.

    కేంద్ర బృందం తీరుపై బండి సంజయ్ ఫైర్

    మే 3 తర్వాత సడలింపుకు పది రోజులుగా రంగం సిద్ధం చేస్తున్నా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు తికమక పెడుతున్నాయి. దానితో రెండు రోజులపాటు మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. చివరకు మరో రెండు వారాలపాటు పొడిగిస్తున్నట్లు హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రకటింపచేశారు.

    ఇదివరకు రెండు సార్లు స్వయంగా లాక్ డౌన్ ను ప్రకటించిన ప్రధాని ఇప్పుడు ఎందుకు మొఖం చాటేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు వాణిజ్య, పారిశ్రామిక వర్గాల నుండి వస్తున్న వత్తిడులు, ఇంకోవైపు ఆర్ధికంగా ఆడుకోమని రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న అభ్యర్ధనలు, మరోవైపు ఆరోగ్య అధికారుల నుండి వస్తున్న హెచ్చరికలు నేపథ్యంలో స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతున్నారా?

    లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?

    శుక్రవారం నాలుగున్నర గంటలసేపు ప్రధానమంత్రి జరిపిన సమాలోచనలో పాల్గొన్న ఒక కేంద్ర మంత్రి సాయంత్రం పాల్గొన్న వెబనార్ సమావేశంలో ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆ మంత్రి ఒక విధంగా అసహనం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది.

    “మేమంతా నాలుగున్నర గంటలసేపు సమాలోచనలు జరిపినా ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటె మీరేవో ఉహించుకొంటున్నారు” అంటూ తమ నిస్సహాయ పరిష్టితిని వెల్లడించారు.

    లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

    రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్ లను జిల్లాల వారీగా పరిగణలోకి తీసుకుంటారా, మండలాలను, డివిజన్ ల వారిగా తీసుకుంటారా? భౌగోళికంగా వాటిమధ్య స్పష్టమైన విభజన లేని పరిస్థితులలో ఒక చోట సడలించి, మరోచోట కఠినంగా అమలు సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కరోనా కేసులను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నా కేంద్ర బృందాలు నిస్సహాయంగా కనిపించడం గమనార్హం.

    ఇలా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టే సమయంలో మరింత కఠినంగా వ్యవహారించాలని కోరింది. కరోనా వైరస్ పూర్తిగా తగ్గే వరకు లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు వద్దని హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికా, భారత్ లాంటి దేశాల్లో సడలింపులు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొనడం గమనార్హం.