Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Sri Rama Look Leaked: 'వారణాసి' లీక్స్.. శ్రీరాముడిగా మహేష్ బాబు లుక్...

Mahesh Babu Sri Rama Look Leaked: ‘వారణాసి’ లీక్స్.. శ్రీరాముడిగా మహేష్ బాబు లుక్ వైరల్..గూస్ బంప్స్ అంటే ఇదే!

Mahesh Babu Sri Rama Look Leaked: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం గురించి సోషల్ మీడియా లో లీకులు రోజురోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. మూవీ టీం ఈ సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు రానివ్వకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా లీకులు తప్పడం లేదు. సోషల్ మీడియా యుగం లో ఉంటూ, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లీకులను కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. ఒక సినిమాకోసం వందల మంది పని చేస్తూ ఉంటారు. వాళ్లందరిలో ఎవరో ఒకరు లీక్ చేస్తారు, సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు మేకింగ్ వీడియోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో లీక్ మూవీ టీం ని కలవరపెడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం లో శ్రీ రాముడి క్యారెక్టర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన లుక్ వేరే లెవెల్ లో ఉంటుందని, నా ఫోన్ లో నిన్నటి వరకు వాల్ పేపర్ గా ఉండేదని, ఈరోజు ఈవెంట్ లో ఎవరైనా చూస్తారేమో అనే భయం తో తీసేసానని రాజమౌళి #GlobeTrotter ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఆ లుక్ ఆయతకు రానివ్వకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ నేడు ఆ లుక్ లీక్ అయిపోయింది. వారణాసి చిత్రం లో మహేష్ బాబు శ్రీరాముడి లుక్ ఇదే, అదిరిపోయింది కదూ అంటూ సోషల్ మీడియా లో ఒక ఫోటో తెగ వైరల్ మారింది. అయితే ఈ లుక్ AI ద్వారా క్రియేట్ చేశారా?, లేదా నిజంగానే సినిమా నుండి లీక్ అయ్యిందా అనేది తెలియడం లేదు. ఈమధ్య కాలంలో AI బాగా వృద్ధి చెందడం తో, అది క్రియేట్ చేస్తున్న ఇమేజీలు ఒరిజినల్ తో సమానంగా ఉంటున్నాయి.

అయితే మహేష్ బాబు నిలబడిన తీరు చూస్తుంటే ఇది నిజమైన ఫోటో నే అని అనిపిస్తుంది. ఈ ఫోటో ని చూసిన తర్వాత అభిమానులే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా మెంటలెక్కిపోతున్నారు . మహేష్ బాబు కచ్చితంగా శ్రీరాముడి లుక్ కి సరిపోతాడని తెలుసు కానీ, ఈ రేంజ్ లో సూట్ అవుతాడని మాత్రం అసలు ఊహించలేదని, ఇది కేవలం రఫ్ కాపీ మాత్రమేనని, సినిమాలో మహేష్ బాబు ని శ్రీ రాముడి లుక్ తో వెండితెర పై చూస్తే మామూలు మూవీ లవర్స్ కూడా చేతులెత్తి దండం పెడతారని, ఆ రేంజ్ లో ఉండబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ఫోటో ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version