Homeఅంతర్జాతీయంBalochistan Pakistan Conflict: బలూచ్‌ చెరలో పాకిస్తాన్‌ సైన్యం.. ప్రాణభిక్ష కోసం ప్రాధేయం..!

Balochistan Pakistan Conflict: బలూచ్‌ చెరలో పాకిస్తాన్‌ సైన్యం.. ప్రాణభిక్ష కోసం ప్రాధేయం..!

Balochistan Pakistan Conflict: పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటింది. భారత్‌తో కలిసే స్వాతంత్య్రం పొందిన పాకిస్తాన్‌ మొదట్లో మంచి సంపన్న దేశం. భారత్‌తో సమానమైన ఎకానమీ కలిగి ఉంది. అపారమైన వనరులు ఉన్న భూభాగాలు పాకిస్తాన్‌వైపు వెళ్లాయి. అయినా అక్కడి పాలకుల తీరు. ఉగ్రవాదం, వనరులను సద్వినియోగం చేసుకోకపోవడం, మత ఛాందసవాదం, భారత్‌పై వ్యతిరేక ధోరణి ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ప్రస్తుతం అప్పు చేయనిదే గడవని పరిస్థితి. ఈ క్రమంలో పాకిస్తాన్‌లో అతిపెద్ద భూభాగం (42 శాతం) కలిగి ఉన్న బలూచిస్తాన్‌ ప్రాంతం పాకిస్తాన్‌లో అత్యంత వెనుకబడిపోయింది. ఇక్కడి వనరులను విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న పాక్‌ పాలకులు.. ఇక్కడ ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి చేయడం లేదు. ఉద్యోగాలు కల్పించడం లేదు. దీంతో దశాబ్దాలుగా పాక్‌ పాలకుల తీరుతో విసిగిపోయిన బలూచ్‌ ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలు పెట్టారు. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరుతో పాకిస్తాన్‌పై హెరాఫ్‌ సాగిస్తున్నారు. గతేడాది హెరాఫ్‌ 2.0 ప్రారంభించారు.

వరుస దాడులు..
బలూచ్‌ ఆర్మీలో గతంలో పురుషులు మాత్రమే ఉండేవారు హెరాఫ్‌ 2.0లో మహిళు సైతం పాల్గొంటున్నారు. ఆత్మాహుతి దళాలుగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్‌ సైన్యం, ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తున్నరు. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఇప్పటికే పదుల సంఖ్యలో దాడులు చేశారు. సైన్యాన్ని చంపేశారు. దీంతో బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌ పాలన దాదాపు లేనట్లే. ఇక బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో అక్కడ సైనికులు కూడా విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు. బతికుంటే బలుసాకు తిని అయినా బతకొచ్చు అన్నట్లుగా ఉద్యోగాలు వదిలేస్తున్నారు.

హెరాఫ్‌ 2.0..
హెరాఫ్‌ 2.0 ప్రారంభించిన బలూచిస్తాన్‌.. వరుస దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజాగా బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాక్‌ సైనికులను కిడ్నాప్‌ చేసి వీడియో విడుదల చేసింది. దీనితో ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. బీఎల్‌ఏ విడుదల చేసిన వీడియోలో యూనిఫాం ధరించిన 7–8 మంది పాకిస్తాన్‌ సైనికులు మోకాలిపై కూర్చుని సైనిక గుర్తింపు కార్డులు చూపిస్తున్నారు. వారు ‘మమ్మల్ని రక్షించండి‘ అని ప్రభుత్వాన్ని వేడుకుంటూ, తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు. ఒక సైనికుడు ‘పాక్‌కోసం పోరాడాను, ఇప్పుడు సైన్యం మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తమ సైనికులు కాదన్న పాకిస్తాన్‌..
పాక్‌ సైన్యం వీడియోలను ‘నకిలీ‘గా పేర్కొంటూ, తమ సైనికులు సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది. కిడ్నాప్‌ జరగలేదని ధ్రువీకరించింది. దీంతో బీఎల్‌ఏ మరో వీడియో విడుదల చేసింది. ఇందులో పాకిస్తాన్‌ సైనికుల ఐడీ కార్డులు కూడా చూపించింది. జైల్లలో ఉన్న బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీని ఫిబ్రవరి 22లోగా విడుదల చేయాలని బీఎల్‌ఏ డిమాండ్‌ చేస్తోంది. లేదంటే సైనికులను చంపేస్తామని హెచ్చరించిది. అయితే ప్రభుత్వం సైన్యాన్ని పట్టించుకోకపోడంతో సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ’ఆపరేషన్‌ హెరాఫ్‌ 2.0’లో 17 మందిని పట్టుకుని, 10 మందిని విడుదల చేసిందని పేర్కొంది. మిగిలిన వారి రిలీజ్‌కు బదులుగా బలూచ్‌ ఖైదీలను విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేసింది.

ఈ సంఘటన పాక్‌ సైన్యం, ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలను బయటపెడుతోంది. సైనికులను ’అజ్ఞాతులు’గా చూపడం ద్వారా బలోచ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వీడియోలు సైనికుల గుర్తింపును ధ్రువీకరిస్తూ ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. బలూచిస్తాన్‌ విడుదల ఉద్యమం బలపడటం, సోషల్‌ మీడియా కారణంగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వివాదం పాక్‌ అంతర్గత స్థిరత్వాన్ని షేక్‌ చేస్తుంది. ఖైదీల మార్పిడి జరిగితే ఉద్రిక్తతలు తగ్గవచ్చు, కానీ విఫలమైతే మరిన్ని దాడులకు దారి తీస్తుంది. ప్రభుత్వం స్పందన లేకపోతే సైనికుల మధ్య అసంతృప్తి పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version