Mamata meets PM Modi: వరి కొనుగోలు విషయంలో అటో, ఇటో తేల్చుకొని వస్తానని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ టూర్ ఫెయిల్ అయ్యింది. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన తిరుగుప్రయాణమయ్యారు. అయితే అదే రోజు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి మాత్రం ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వారి మధ్య ఆ రాష్ట్ర, దేశ శాంతిభద్రతలకు సంబంధించిన చాలా కీలకమైన చర్చలు జరిగాయి. చాలా ముఖ్యమైన అంశం కాబట్టే నరేంద్ర మోడీ మమతా బెనర్జీకి అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇండియాకు, బంగ్లాదేశ్‌కు బార్డర్ గా ఉంటుంది. దేశ రక్షణ వ్యవహారాలు అన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అందుకే ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ కాస్తూ ఉంటారు. అయితే ఇటీవల బీఎస్ఎఫ్ జవాన్ల పరిధిని కేంద్రం విస్తరించాలనుకుంది. ఇది ఇప్పుడు వివాదాలకు దారి తీసింది. దీంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. పశ్చిమ బెంగాల్, త్రిపుర మధ్య రాజకీయ ఘర్షణలు చెలరేగాయి. దీని ప్రభావం మహారాష్ట్ర మీద కూడా పడింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో మమతా బెనర్జీ నిన్న సమావేశం అయ్యారు.
రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఘర్షణలు నెలకొనడానికి అక్కడ అధికారంలో ఉన్న బీజేపీయే ప్రధాన కారణం అని మమతా తెలిపారు. టీఎంసీ నేతలను త్రిపుర పోలీసులు టార్గెట్ గా చేసుకున్నారని ఆరోపించారు. అలాగే బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించడం తమకు రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కులను కాలరాయడమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్ర పరిధిలో అంశమని చెప్పారు. బీఎఫ్ఎఫ్‌పై తమకు గౌవరం ఉందని అన్నారు. కానీ దానిని పరిధిని విస్తరించడం సరైంది కాదని అన్నారు. అలాగే గతంలో పశ్చిమ బెంగాల్‌లో వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయని చెప్పారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రకటించిన రూ. లక్ష కోట్ల నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని కోరారు.
Also Read: Population In India: దేశంలో తగ్గుతున్న జనాభా.. వెల్లడిస్తున్న గణాంకాలు
ఈ సమావేశం అనంతరం ఆమె బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని కలిశారు. ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఎవరు ఎవరినైనా కలవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ఆహ్వానిస్తే, ఆయనతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే సీఎం కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా, మమతా బెనర్జీకి అవకాశం ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఈ అంశంలో తెలంగాణ సీఎం ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Also Read: India -Pakistan war in 1971: భారత్ -పాక్ యుద్ధం..: 1971 డిసెంబర్ నెలలో ఏం జరిగింది..?