https://oktelugu.com/

Samantha: పూజా వద్దనుకున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్​.. సమంత చేతుల్లోకి

Samantha: సూపర్​స్టార్ మహేశ్​బాబూ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో పనిచేయనున్నారు మహేశ్​. ఈ క్రమంలోనే మహేశ్​ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ సినిమాలో మహేశ్​ సరసన పూజా హెగ్డే నటించనుందని మొదట్లో వార్తు వినిపించాయి. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పూజా హెగ్డే ఈ సినిమాను వద్దనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతంం రాధేశ్యామ్​, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 02:15 PM IST
    Follow us on

    Samantha: సూపర్​స్టార్ మహేశ్​బాబూ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో పనిచేయనున్నారు మహేశ్​. ఈ క్రమంలోనే మహేశ్​ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ సినిమాలో మహేశ్​ సరసన పూజా హెగ్డే నటించనుందని మొదట్లో వార్తు వినిపించాయి. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పూజా హెగ్డే ఈ సినిమాను వద్దనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతంం రాధేశ్యామ్​, బీస్ట్​, ఆచార్య, సర్కస్​ వంటి చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉన్న పూజా.. వరుసగా టైట్​ షెడ్యూల్​తో ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు కాక ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

    Samantha and Pooja Hegde

    Also Read: ఆ పాత్రను అందుకే చేశానని మనసులో మాట చెప్పిన సమంత…

    ఇప్పటికి రాదేశ్యామ్​, ఆచార్య సినిమా షూటింగ్​ పూర్తికాగా.. మిగిలిన చిత్రాలు సెట్స్​పై ఉన్నాయి. కాగా, ఈ సినిమా కోసం త్రివిక్రమ్​ నేరుగా సమంతను సంప్రదించినట్లు సమాచారం. దీనికి ఆమె గ్రీన్​ సిగ్నల్​కూడా ఇంచిందని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడుందట.  ఈ సినిమాలో సామ్ నటించడం నిజమైతే.. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వీరిద్దరి కాంబోలో మరో హిట్​​ సినిమా ఇదే అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

    ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తోంది. గుణశేకర్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం సామ్ అన్నపూర్ణ స్టూడియోస్​లో అడుగుపెట్టనట్లు సమాచారం.

    Also Read: ఆ విషయంలో ఓకే చెప్పేందుకు భాష పెద్ద సమస్య కాదంటున్న సమంత