ఇటీవల మంత్రిపై ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది రేవంత్ రెడ్డే. ఆయనపై వ్యంగ్యాస్రాలు విసిరారు. భూములు కబ్జా చేయడం, వేదికలెక్కి జోకర్ లా వ్యవహరించడం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. భూములు అమ్మినా కొన్నా ఈ మంత్రి జోక్యం తప్పనిసరని చెప్పారు. బ్రోకర్లను మించిన బ్రోకర్ అని విమర్శించారు. దీంతో మంత్రి మల్లారెడ్డిని మాటలతో రెచ్చగొట్టారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి కూడా అదే స్థాయిలో స్పందించారు.
దీంతో రేవంత్ రెడ్డి మాటలకు రెచ్చిపోయిన మల్లారెడ్డి తన మాటలతో బ్యాలెన్స్ తప్పారు. మంత్రి మల్లారెడ్డి మాటలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయనకు ఆగ్రహం వచ్చిందంటే చాలు ఊగిపోతారు. ఆవేశంతో రగిలిపోతారు. రేవంత్ రెడ్డి మాటలకు కూడా అదే తీరుగా తిట్టేశారు. రాయడానికి కూడా వీలు లేని భాషలో దుర్భాషలాడారు. మంత్రిని రెచ్చగొట్టడంలో రేవంత్ సఫలమైనట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో కేసీఆర్ పై విమర్శలు చేసినా ఆయన అంత త్వరగా రియాక్ట్ అయ్యే ధోరణి కాకపోవడంతో సమయం కోసం వేచిచూస్తారు. టైం వచ్చినప్పుడు మొత్తం కూలి తీస్తారు. అంది ఆయన నైజం.
అయితే మంత్రి మల్లారెడ్డిని ఉడికించి ఆయనలోని కోపాన్ని బయటకు తెప్పించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఆయనతో రెచ్చిపో యి మాట్లాడేలా చేసి వారిలోని ఆగ్రహాన్ని కలిగించడంలో రేవంత్ ప్లాన్ వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. తాను మాట్లాడిన మాటలకు రియాక్ట్ అయ్యేలా చేసి తన వ్యూహం వర్కవుట్ చేసుకున్నారు. అధికార పార్టీలో నేతలను టార్గెట్ చేసుకుని వారిని మాటల గారడీలో దింపి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత గ్రామంలో వ్యూహం ప్రకారం దీక్ష చేస్తున్నట్లు సమాచారం.